iDreamPost

డిజాస్టర్ లవర్ – క్లోజింగ్ కలెక్షన్స్

డిజాస్టర్ లవర్  – క్లోజింగ్ కలెక్షన్స్

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ తో జనం తిరస్కారానికి గురైన ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు యూనిట్ కనీసం పోస్ట్ పబ్లిసిటీ ప్రమోషన్లు కూడా చేసుకోలేకపోయింది. నిర్మాత కేఎస్ రామారావు హీరోనే రీఫండ్ అడుగుతారని వచ్చిన వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాన కేంద్రాల్లో ఏదోలా లాగిస్తున్నా ఇప్పటికే చాలా డెఫిసిట్ లో ఉన్న లవర్ ఫైనల్ రన్ కు వచ్చేశాడు.

సుమారు 24 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ ఇప్పటిదాకా ఇచ్చింది కేవలం 9 కోట్లు మాత్రమే. పెట్టుబడి లెక్కల్లో చూసుకుంటే ఇది కనీసం నలభై శాతం కూడా కాదు. కనీసం యావరేజ్ టాక్ వచ్చినా ఎంతో కొంత బెటర్ గా రాబట్టేది కాని దీనికి ఆ ఛాన్స్ ఒక్క శాతం కూడా లేకుండా పోయింది. నలుగురు హీరొయిన్లతో ఏదో కొత్తగా కథను చెప్పే ప్రయత్నంలో దర్శకుడు క్రాంతి మాధవ్ తిరిగి అర్జున్ రెడ్డి ఫ్లేవర్ నే ఆశ్రయించడంతో దానికి తగ్గ ఫలితమే దక్కింది.

పాటలు వీక్ గా ఉండటం, హీరో పాత్ర అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం పబ్లిక్ మాత్రమే కాదు అభిమనులూ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వచ్చిన తొమ్మిది కోట్లలో ఒక్క నైజాం నుంచే 3 కోట్లకు పైగా రాబట్టి కొంచెం పర్వాలేదు అనిపించాడు కాని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మరీ తీసికట్టు వసూళ్లు నమోదయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ ఒక గట్టి వార్నింగ్ బెల్ లా పనిచేసింది. కథ మీద సరైన కసరత్తు చేయకుండా కేవలం బాడీ లాంగ్వేజ్ ని నమ్ముకుని సినిమాలు తీస్తే ఏమవుతుందో బాక్స్ ఆఫీస్ సాక్షిగా వరల్డ్ ఫేమస్ లవర్ రుజువు చేశాడు. ఏరియాల వారిగా ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు ఫిగర్స్ ఈ విధంగా ఉన్నాయి

ఫుల్ రన్ వసూళ్లు:

ఏరియా  షేర్ 
నైజాం  3.5cr
సీడెడ్  0.85cr
ఉత్తరాంధ్ర  0.70cr
గుంటూరు  0.48cr
క్రిష్ణ  0.50cr
ఈస్ట్ గోదావరి  0.63cr
వెస్ట్ గోదావరి  0.30cr
నెల్లూరు  0.26cr
ఆంధ్ర+తెలంగాణా  7.22cr
కర్ణాటక + ROI  0.90cr
ఓవర్సీస్  0.95cr
ప్రపంచవ్యాప్తంగా 9.07cr

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి