iDreamPost

టిల్లు స్క్వేర్ వారం రోజుల కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే!

  • Published Apr 06, 2024 | 11:37 AMUpdated Apr 06, 2024 | 11:37 AM

టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. వారం రోజులు అయినా కూడా.. ఇంకా ఈ సినిమా హావ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ప్రస్తుత కలెక్షన్స్ వంద కోట్ల మార్క్ ను దాటేందుకు దగ్గరలో ఉంది. మరి, ఈ సినిమా ఎనిమిది రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. వారం రోజులు అయినా కూడా.. ఇంకా ఈ సినిమా హావ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ప్రస్తుత కలెక్షన్స్ వంద కోట్ల మార్క్ ను దాటేందుకు దగ్గరలో ఉంది. మరి, ఈ సినిమా ఎనిమిది రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 06, 2024 | 11:37 AMUpdated Apr 06, 2024 | 11:37 AM
టిల్లు స్క్వేర్ వారం రోజుల కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే!

మార్చి 29న థియేటర్స్ లో రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు అతి చేరువలో ఉంది. దర్శకుడు మారినా కానీ ఒక సిక్వెల్ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడం బహుశా ఇదే తొలిసారేమో అన్న రేంజ్ లో.. టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 27 కోట్ల వరకు ప్రీ మార్కెట్ జరిగింది. దీనితో టిల్లు స్క్వేర్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లకు ఫిక్స్ అయింది. ఇక మొదటి రోజు 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. రెండ రోజూ కూడా టిల్లు స్క్వేర్ రూ.20 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇక నాలుగవ రోజు వరకు టిల్లు స్క్వేర్ సినిమా రూ. 78 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఆరు రోజులకు రూ.91 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. మరి ఈ సినిమా ఎనిమిది రోజులలో మొత్తంగా ఎన్ని కోట్ల సంపాదించిందో చూసేద్దాం.

సాధారణంగా బడా హీరోల చిత్రాల తప్ప.. మిగిలిన సినిమాలకు ఏవైనా వారం రోజుల వరకు మాత్రమే బజ్ నడుస్తూ ఉంటుంది. కానీ, టిల్లు స్క్వేర్ కు మాత్రం.. సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటినా కానీ.. కలెక్షన్స్ విషయంలో కానీ, టాక్ విషయంలో కానీ ఈ సినిమా ఎక్కడా రాజి పడడం లేదు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో .. బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టిస్తోంది. టీజర్ రిలీజ్ చేసినపుడు ఏ హైప్ అయితే క్రియేట్ అయిందో.. ఈరోజుకు కూడా అదే హైప్ తో.. చెప్పాలంటే అంతకంటే ఎక్కువ హైప్ తోనే థియేటర్స్ లో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఈ సినిమా ఎనిమిది రోజుల కలెక్షన్స్ రూ.96.6 కోట్లకు చేరుకుంది. అంటే 100కోట్ల క్లబ్ లో చేరేందుకు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీనితో చిత్ర బృందం అంతా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. త్వరలోనే ఈ సినిమా 100కోట్లు సాధించడం పక్కా అని భావిస్తున్నారు.

Tillu square

అయితే, ఈ సినిమాకు లభిస్తున్న క్రెడిట్ అంతా డైరెక్టర్ దే అని అంటున్నారు కొంతమంది అభిమానులు. ఎందుకంటే, డీజే టిల్లు సినిమాకు ఈ దర్శకుడికి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ సినిమాను అదే ఫ్లో లో కొనసాగిస్తూ.. డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.. మల్లిక్ రామ్. ఇక ఈ సినిమాలో అనుపమ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరితో పాటు.. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కూడా వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా రెండు పార్ట్స్ కు వస్తున్న హావ చూసి.. మూడవ పార్ట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. మరి, టిల్లు హావ ఎంత వరకు కొనసాగుతుందో వేచి చూడాలి. చూడబోతుంటే థియేటర్స్ లో ఈ సినిమా సందడి ఇంకా కొన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి