iDreamPost

అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కప్పు రాకున్నా అతడు దొరికాడు చాలంటూ..!

  • Author singhj Published - 11:42 AM, Sat - 25 November 23

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్ కప్ రాకపోయినా భారత్​కు ఒక ఛాంపియన్ బ్యాటర్ దొరికాడన్నాడు.

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్ కప్ రాకపోయినా భారత్​కు ఒక ఛాంపియన్ బ్యాటర్ దొరికాడన్నాడు.

  • Author singhj Published - 11:42 AM, Sat - 25 November 23
అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కప్పు రాకున్నా అతడు దొరికాడు చాలంటూ..!

వన్డే వరల్డ్ కప్-2023 ముగిసి ఆరు రోజులు అవుతున్నా ఓటమి మిగిల్చిన బాధ నుంచి భారత అభిమానులు ఇంకా బయట పడటం లేదు. ఫైనల్​లో ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమితో కప్పు చేజార్చుకున్న తీరుకున్న ఇంకా మర్చిపోలేకపోతున్నారు. మెగా టోర్నీ మొత్తం అగ్రెసివ్​ గేమ్​తో వరుస విజయాలు సాధించిన రోహిత్ సేన.. తుదిమెట్టుపై బోల్తా పడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా ఓటమిని క్రికెట్ మాజీలు, ఫ్యాన్స్ ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. తీవ్ర నిరాశకు గురైన టీమిండియా ప్లేయర్స్​కు యావత్ దేశం సపోర్టుగా నిలిచింది. చాలా మంది వెటరన్ క్రికెటర్లు భారత జట్టు ఆటగాళ్లను ఓదారుస్తున్నారు.

టీమిండియా వరల్డ్ కప్ గెలవలేకపోయినా అద్భుతమైన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ప్రతి టీమ్ నెగ్గాలనే అనుకుంటుందని.. కానీ చివరికి ఏదో ఒక టీమ్ మాత్రమే విజేతగా నిలుస్తుందని చెబుతున్నారు. ఫైనల్​లో ఇంకా బెటర్​గా ఆడి ఉంటే ఆస్ట్రేలియాను మట్టికరిపించే వారమని భారత క్రికెటర్లలో ధైర్యాన్ని నింపుతున్నారు. అయితే ఈ ఓటమి నుంచి రోహిత్ సేన నేర్చుకోవాల్సింది చాలా ఉందని కపిల్ దేవ్ సహా పలువురు లెజెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మెగా టోర్నీ ఫైనల్ తర్వాత భారత క్రికెటర్లు ఒకరిద్దరు తప్ప అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

ప్రపంచ కప్ టీమ్​లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మాత్రం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​తో బిజీ అయిపోయారు. మిగిలిన ప్లేయర్లు ఇళ్లకు చేరుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. వారిలో చాలా మంది ఆసీస్​తో టీ20 సిరీస్​లో ఆడాల్సింది. కానీ ఆసియా కప్-2023, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, అనంతరం ప్రపంచ కప్ కారణంగా చాలా అలసిపోయారు. అందుకే ముందే ప్లాన్ చేసిన బీసీసీఐ.. సీనియర్స్​కు కంగారూలతో టీ20 సిరీస్​లో ఆడించకుండా విశ్రాంతిని ఇచ్చింది. రెస్ట్ తీసుకుంటున్న భారత క్రికెటర్లు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం వరుస వీడియోలు షేర్ చేస్తూ బిజీ అయ్యాడు.

మెగా టోర్నీ ఫైనల్ ఓటమితో పాటు ఇతర విషయాలను అనాలసిస్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు అశ్విన్. వరల్డ్ కప్ ఫైనల్​ ఓటమి, ఆసీస్ టీమ్ ప్లానింగ్ గురించి ఈ సీనియర్ స్పిన్నర్ చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఫైనల్ మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన అహ్మదాబాద్ పిచ్​ను కంగారూ జట్టు బాగా అర్థం చేసుకుందని.. ప్లాన్ ప్రకారం టాస్​ గెలిచి బౌలింగ్​కు దిగిందని అశ్విన్ అన్నాడు. ఐపీఎల్​తో పాటు భారత్​లో చాలా సిరీస్​ల్లో ఆడటం ఆస్ట్రేలియాకు బాగా కలిసొచ్చిందన్నాడు. అయితే టీమిండియాకు ప్రపంచ కప్ రాకపోయినా మెగా టోర్నీలో శ్రేయస్ అయ్యర్ లాంటి ఓ ఛాంపియన్ బ్యాటర్ దొరికాడన్నాడు.

శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటర్. పర్ఫెక్షన్ సాధించడం అంత ఈజీ కాదు. పుల్ షాట్ బలహీనత నుంచి బయటపడాలని ముందే డిసైడ్ అయ్యాడు అయ్యర్. ఆ షాట్ ఆడే క్రమంలో కొన్నిసార్లు ఔటైనా.. చాలా బంతుల్ని సక్సెస్​ఫుల్​గా బౌండరీలకు తరలించాడు. ఇండియా టీమ్​లో ఒక ఛాంపియన్ బ్యాట్స్​మన్​ తయారవుతున్నాడని మాత్రం కచ్చితంగా చెబుతున్నా’ అని తెలిపాడు అశ్విన్. మరి.. టీమిండియాకు అయ్యర్ రూపంలో ఛాంపియన్ బ్యాటర్ దొరికాడంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టీమిండియా పేసర్.. వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటోలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి