iDreamPost
android-app
ios-app

వాళ్ల మాటలు పట్టించుకోనందుకు హ్యాపీ.. బుమ్రా కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..?

  • Author singhj Published - 09:41 PM, Tue - 31 October 23

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్నాడు. ఎంతటి డేంజరస్ బ్యాటర్​నైనా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. బుమ్రాను ఎదుర్కోవాలంటే బ్యాటర్లు వణుకుతున్నారు.

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్నాడు. ఎంతటి డేంజరస్ బ్యాటర్​నైనా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. బుమ్రాను ఎదుర్కోవాలంటే బ్యాటర్లు వణుకుతున్నారు.

  • Author singhj Published - 09:41 PM, Tue - 31 October 23
వాళ్ల మాటలు పట్టించుకోనందుకు హ్యాపీ.. బుమ్రా కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..?

వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో తమకు మెగాటోర్నీలో తిరుగులేదని రోహిత్ సేన మరోసారి ప్రూవ్ చేసింది. ఇంగ్లండ్ మీద గెలుపుతో సెమీఫైనల్ బెర్త్​ను దాదాపుగా ఖాయం చేసుకుంది. నెక్స్ట్ శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్​తో భారత్ మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ఇందులో సఫారీ టీమ్​తో మ్యాచ్ కీలకంగా చెప్పొచ్చు. మిగిలిన రెండు టీమ్స్​ను తేలిగ్గా తీసిపారేయలేం. కానీ ప్రస్తుతం ఉన్న ఫామ్​లో భారత్​ను ఆపడం లంక, డచ్ టీమ్​కు అంత ఈజీ కాదు. అందుకే ఈ రెండు మ్యాచుల్లోనూ రోహిత్ శర్మ, ద్రవిడ్​లు ప్రయోగాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. బెంచ్ స్ట్రెంగ్త్​ను టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ వరల్డ్ కప్​లో భారత విజయాల్లో బ్యాటర్లతో పాటు బౌలర్ల కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. ముఖ్యంగా పేసర్ జస్​ప్రీత్ బుమ్రా అయితే ప్రతి మ్యాచ్​లోనూ బౌలింగ్​లో అదరగొడుతుండటం విశేషం. బుమ్రాను ఫేస్ చేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. అయితే ఆసియా కప్-2023కు ముందు వరకు బుమ్రా ఫామ్, ఫిట్​నెస్ విషయంలో అనుమానాలు ఉండేవి. ఇంజ్యురీ తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన ఈ స్టార్ బౌలర్ ఏ మేరకు రాణిస్తాడనే అనుమానం చాలా మందిలో ఉండేది. అయితే ఆసియా కప్ నుంచి ఇప్పటిదాకా అద్భుతంగా రాణిస్తూ తన బౌలింగ్​లో పస తగ్గలేదని.. మునుపటి కంటే మరింత డేంజరస్​ బౌలర్​ను తానని ప్రూవ్ చేసుకున్నాడు బుమ్రా. ఈ వరల్డ్ కప్​లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడతను. అలాంటి బుమ్రా గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇవ్వడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘నా వైఫ్ స్పోర్ట్స్ మీడియాలో పనిచేస్తోంది. అందువల్ల నా కెరీర్​ మీద చాలా డౌట్స్ వచ్చాయని నాకు తెలిసింది. నేను ఇక టీమ్​లోకి తిరిగి రాలేనని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేశారని తెలిసింది. నేను వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడెంతో హ్యాపీగా ఉన్నా. టీమ్​లోకి తిరిగొచ్చా. గేమ్​ను ఎంత లవ్ చేస్తున్నానో తెలుసుకున్నా. ఇంజ్యురీ నుంచి కోలుకున్నాక టీమ్​లో చాలా మంచి ఛాన్సులు లభించాయి’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. బుమ్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంజ్యురీ టైమ్​లో తనను ఉద్దేశించి కొందరు విమర్శకులు, మాజీలు చేసిన వ్యాఖ్యలు అతడ్ని బాధించి ఉంటాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వారిని ఉద్దేశించే అతడీ వ్యాఖ్యలు చేశాడేమోనని చెబుతున్నారు. మరి.. బుమ్రా వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: లంకతో మ్యాచ్​కు ముందు కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తన డ్రీమ్ అదేనంటూ..!