iDreamPost

మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా 11 వేలు.. ఎలా పొందొచ్చంటే?

దేశంలోని మహిళల కోసం కేంద్రం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఏంకగా రూ. 11 వేలు ఉచితంగా అందుకోవచ్చు. ఈ పథకానికి అర్హులు ఎవరంటే?

దేశంలోని మహిళల కోసం కేంద్రం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఏంకగా రూ. 11 వేలు ఉచితంగా అందుకోవచ్చు. ఈ పథకానికి అర్హులు ఎవరంటే?

మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా 11 వేలు.. ఎలా పొందొచ్చంటే?

మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల ద్వారా వారికి ఆర్థికభరోసా ఇచ్చి అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నాయి. పోస్టాఫీస్ పథకాల ద్వారా అధిక రాబడులు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. సుకన్య సమృద్ది యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి పథకాలతో మహిళలకు లబ్ధి చేకూరుతోంది. మహిళలకు మరో గుడ్ న్యూస్. కేంద్రం తీసుకొచ్చిన ఆ పథకం ద్వారా ఉచితంగా రూ. 11 వేలు అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటీ? ఎవరు అర్హులు? ఈ పథకంలో ఎలా చేరాలి? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోని మహిళలకు ఆర్థిక సాయం అందిచేందుకు కేంద్రం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం ద్వారా గర్భిణీలకు రూ. 11 వేలు అందిస్తారు. ఈ పథకానికి గర్భిణీలు, బాలింతలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ జన్మించే వరకూ మూడు విడతల్లో రూ.11 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. నేరుగా మహిళ అకౌంట్ లోనే జమ చేస్తారు. ఈ పథకానికి అప్లై చేసుకున్న గర్బిణీలకు మొదటిసారి తల్లి కాబోతున్నట్లయితే 5000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత రెండోసారి ఆడపిల్ల పుడితే రూ.6వేలు అందిస్తోంది. మొత్తంగా రూ. 11 వేలు అందిస్తారు.

అయితే ముందుగా ఇచ్చే 5 వేలలో.. గర్భం దాల్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3 వేలు ఇస్తారు. శిశువు జననం అనంతరం రూ. 2వేలు అందిస్తారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఆ మహిళా 19 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకులు, ఆశా వర్కర్లు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొదేందుకు అర్హులే. ఈ పథకానికి ఆన్ లైన్ , ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmmvy.wcd.gov.in. ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి