iDreamPost

వీడియో: రీల్స్ చేస్తున్న మహిళ.. అంతలోనే ఊహించని ఘటనతో షాక్!

  • Published Mar 25, 2024 | 10:23 AMUpdated Mar 25, 2024 | 10:23 AM

Woman Filming Reel: ఈ మద్య సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది రీల్స్ చేస్తూ దుమ్మురేపుతున్నారు. డ్యాన్స్, డైలాగ్స్, పాటలు ఇలా ఎన్నో రకాల రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Woman Filming Reel: ఈ మద్య సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది రీల్స్ చేస్తూ దుమ్మురేపుతున్నారు. డ్యాన్స్, డైలాగ్స్, పాటలు ఇలా ఎన్నో రకాల రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

  • Published Mar 25, 2024 | 10:23 AMUpdated Mar 25, 2024 | 10:23 AM
వీడియో: రీల్స్ చేస్తున్న మహిళ.. అంతలోనే ఊహించని ఘటనతో షాక్!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. ఇటీవల కొంతమంది ఔత్సాహికులు రీల్స్, యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పాటలు పాడటం, డైలాగ్స్, డ్యాన్సులు, సాహస కృత్యాలు ఇలా ఎన్నో రకాల ఫీట్స్ చేస్తూ సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేసి లైక్స్, కామెంట్స్, షేర్ అంటారు. కొన్ని వీడియోలు బాగా క్లిక్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన వారు కూడా ఉన్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా రీల్స్ తో ఊదరగొడుతున్నారు. ఓ మహిళ రీల్స్ చేస్తున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఓ మహిళ రోడ్డుపై రీల్స్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా అక్కడికి ఓ చైన్ స్నాచర్ వచ్చి మెడలో గొలుసు లాక్కెల్లాడు. ఏం జరుగుతంతో అర్థంకా బిక్కముఖం వేసుకొని లబో‌దిబో అంటూ అరిచింది ఆ మహిళ. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ ఇంద్రపురానికి చెందిన సుష్మ రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లోపోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రోడ్డు పై నడుచుకుంటూ వస్తుంది. అంతలోనే అక్కడికి బైక్ పై హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి సుష్మ మెడలోని బంగారు గొలుసు లాక్కెల్లాడు. ఈ హఠాత్పరిణామానికి రీల్ చేస్తున్న సుష్మా, ఆమె స్నేహితురాలు ఒక్కసారే షాక్ తిన్నారు. ఏం జరుగుతుందని ఆలోచించేలోపే బైక్ పై దొంగ ఉడాయించాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చైన్ స్నాచర్ ని వెతికే పనిలో ఉన్నారు.

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు. ఆ సమయంలో కొన్ని సాహసకృత్యాలకు పాల్పపడుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. రీల్స్ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఆ సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొంతమంది రోడ్డు పై రీల్స్ చేస్తూ తోటి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రీల్స్ చేస్తూ నిర్లక్ష్యంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని పోలీసులు అంటున్నారు. రీల్స్ చేసేవారు తమ చుట్టు పక్కల ఏం జరుగుతుందన్న విషయంపై కూడా ద్యాస ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రీల్స్ లో ఇది కూడా ఒక భాగమే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రీల్స్ చేసే సమయంలో కాస్తు చుట్టు పక్కల కూడా గమనిస్తే మంచిది అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి