SNP
టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇవాళ సెమీస్, 19న ఫైనల్ నెగ్గితే టీమిండియాదే కప్పు. అయితే.. ఈ టైమ్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇవాళ సెమీస్, 19న ఫైనల్ నెగ్గితే టీమిండియాదే కప్పు. అయితే.. ఈ టైమ్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రస్తుతం అందరి ఫోకస్ వరల్డ్ కప్‌పైనే ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో సెమీస్‌తో పాటు.. ఫైనల్‌లో గెలిస్తే టీమిండియాదే కప్పు. ఇప్పటి వరకు వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు.. మరో రెండు.. కేవలం రెండు మ్యాచ్‌లు గెలిస్తే చాలు విశ్వవిజేతగా అవతరిస్తోంది. కివీస్‌తో ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అందరి దృష్టి సెమీస్‌పైనే ఉంది. జట్టు కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. దీంతో భారత్ విజయం సాధిస్తుందని క్రికెట్ అభిమానులంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌కు సంబంధించిన విషయం బయటికొచ్చింది.
ఈ వరల్డ్ కప్ 2023 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని.. రోహిత్ చిన్ననాటి కోచ్ దినేష్ లాద్ వెల్లడించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 ఏళ్లు. దీంతో మరెంతో కాలం అతను క్రికెటర్‌గా కొనసాగే అవకాశం లేదు. ఈ వరల్డ్ కప్‌ను టీమిండియా కనుక నెగ్గితే.. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏం ఉంటుంది. బహుషా ఈ వరల్డ్ కప్ స్టేజ్ రోహిత్ వర్మకు ఫేవరెల్ సెర్మనీ అవుతుందని భావిస్తున్నట్లు దినేష్ పేర్కొన్నాడు. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. జట్టులో అందరని కలుపుకుపోతూ.. ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి టీమ్ కోసం ఆడేలా చూస్తున్నాడు.
ముఖ్యంగా ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఒక ఓపెనింగ్ బ్యాటర్ అద్బుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు. పవర్ ప్లేలో వేగంగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టుపై తొలి ఓవర్ నుంచే ఒత్తిడి పెడుతున్నాడు. దాంతో ప్రత్యర్థి మెయిన్ బౌలర్లు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. తన వ్యక్తిగత రికార్డులపై ఏ మాత్రం ఫోకస్ పెట్టని రోహిత్ శర్మ కేవలం టీమ్ కోసమే ఆలోచించి ఆడుతున్నాడు. రోహిత్ అలా వేగంగా ఆడి.. పవర్ ప్లేలో భారీగా పరుగులు చేస్తుండటంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఎలాంటి ఒత్తిడి ఉండటం లేదు. ఫ్రీగా ఆడుకునే అవకాశం దక్కుతుంది. ఇక కెప్టెన్‌గా రోహిత్ సూపర్ అని చెప్పాలి. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ మార్పుల్లో వందకు వంద మార్కులు కొట్టేస్తున్నాడు. మరి ఇంత సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న రోహిత్ శర్మకు ఆ కప్పు ఏదో దక్కితే బాగుంటుందని అంతా కోరుకుంటున్నారు. మరి రోహిత్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
VIDEO | “I am more than 100 per cent sure that India has a very high chance of winning. All players have been performing well,” says Rohit Sharma’s childhood coach Dinesh Lad as India prepare to take on New Zealand in the ICC Men’s Cricket World Cup 2023 semi-finals tomorrow at… pic.twitter.com/Vdnt5FccyN
— Press Trust of India (@PTI_News) November 14, 2023
Dinesh Lad, Rohit Sharma’s childhood coach believes this might be Rohit’s farewell to the World Cup stage.https://t.co/THJ2MOsmOX
— CricTracker (@Cricketracker) November 14, 2023