iDreamPost

Pushpa OTT : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అంత త్వరగా ఇస్తారా

Pushpa OTT : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అంత త్వరగా ఇస్తారా

ఎవరూ ఊహించని విధంగా పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఈ నెల 7నే అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ కాబోతోందని వస్తున్న వార్త అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తప్పుకోవడంతో ఇంకో పది రోజుల పాటు పుష్పకు ఈ అంశం కలిసి వస్తుందని ట్రేడ్ భావిస్తోంది. అలాంటప్పుడు ఇరవై రోజులకే ఓటిటి అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. నిర్మాణ సంస్థ మైత్రి నుంచి దీన్ని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ డేట్ తాలూకు ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ సడన్ గా డేట్లు అనౌన్స్ చేయడం కొత్తేమి కాదు.

ఇది నిజమనుకోవడానికి ఒక కోణం ఉంది. పుష్పను ఓటిటి ఒప్పందం చేసుకున్న టైంలో ఇరవై రోజుల గడువు చాలనుకుని ఉండొచ్చు. ఎందుకంటే 7న ఆర్ఆర్ఆర్ వస్తుంది కాబట్టి అప్పటికంతా పుష్ప రన్ థియేటర్లలో పూర్తవుతుంది. సో గ్యాప్ తక్కువ ఉన్నా స్ట్రీమింగ్ చేయడం వల్ల వచ్చే నష్టమేమి లేదు. కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా తప్పుకుంది. ఆ డేట్ కి చెప్పుకోదగ్గ చిత్రం ఏదీ లేదు. మాస్ ఆడియన్స్ కి మళ్ళీ పుష్పా లేదా అఖండ ఈ రెండు మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా ఓటిటిలో వస్తే మాత్రం తగ్గుతాయి. గతంలో విజయ్ మాస్టర్ కు సైతం అచ్చం ఇలాగే చేసింది అమెజాన్ ప్రైమ్.

కాబట్టి ఈ వార్తను పూర్తిగా కొట్టిపారేయలేం. అలా అని నిజమని కాదు. రిలీజ్ కు ముందు పుష్ప ఓటిటి యాభై రోజుల గ్యాప్ తో డీల్ అయ్యిందని న్యూస్ వచ్చింది. అది నిజమని కూడా నిర్మాతలు ధ్రువీకరించలేదు. సో ఒకవేళ 7న పుష్ప ప్రైమ్ లో రాకపోతే బన్నీ ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. హిందీ డబ్బింగ్ వెర్షన్ తో అదరగొడుతున్న పుష్ప నిన్న మొన్న వీకెండ్ ని బాగా సొమ్ము చేసుకుంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అల వైకుంఠపురములో స్థాయి టాక్ రాకపోయినా పుష్ప ఇండస్ట్రీ హిట్ దిశగా అడుగులు వేయడం ఖచ్చితంగా టైమింగ్ వల్ల కలిగిన ప్రయోజనమనే చెప్పాలి. చూడాలి మరి ఈ ఓటిటి టాక్ నిజమో కాదో

Also Read : PC Reddy : పిసి.రెడ్డి, ఒక జ్ఞాప‌కం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి