iDreamPost

ఇంత బాగా ఆడుతున్నా.. ఫ్రేజర్‌ను టీ20 WCకు ఎందుకు సెలెక్ట్‌ చేయలేదో తెలుసా?

  • Published May 08, 2024 | 11:44 AMUpdated May 08, 2024 | 11:44 AM

Jake Fraser Mcgurk, T20 World Cup 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌గా.. ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న జేక్‌ ఫ్రేజర్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయకపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Jake Fraser Mcgurk, T20 World Cup 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌గా.. ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న జేక్‌ ఫ్రేజర్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయకపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 08, 2024 | 11:44 AMUpdated May 08, 2024 | 11:44 AM
ఇంత బాగా ఆడుతున్నా.. ఫ్రేజర్‌ను టీ20 WCకు ఎందుకు సెలెక్ట్‌ చేయలేదో తెలుసా?

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బాగా వినిపిస్తున్న పేరు జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌. పేరు పలికేందుకు ఇబ్బందిగా ఉన్నా.. అతని ఆట మాత్రం అద్భుతంగా ఉంది. ఎదురుగా ఏ బౌలర్‌ ఉన్నా కూడా లెక్కచేయకుండా.. తొలి బంతి నుంచే విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరంలా దొరికాడు ఈ కుర్రాడు. అతని కోసం ఏకంగా డేవిడ్‌ వార్నర్‌నే పక్కనపెట్టేశారంటే.. అతను ఏ రేంజ్‌లో ఆడుతున్నాడో ఊహించుకోవచ్చు. మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో.. ఆర్‌ఆర్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లను పచ్చికొట్టుడు కొట్టాడు. టీమిండియా బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 4, 4, 4, 6, 4, 6తో దుమ్మరేపాడు.

ఐపీఎల్‌లో ఇంత అద్భుతంగా ఆడుతున్నా.. ఈ కుర్రాడిని ఎందుకు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఎంపిక చేయలేదని క్రికెట్‌ అభిమానులంతా తెగ ఆలోచిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ అండర్‌ 19 కుర్రాడిని ఐపీఎల్‌ 2024 కోసం గాయంతో దూరమైన లుంగి ఎన్గిడి ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఆరంభం మ్యాచ్‌ల్లో ఫ్రేజర్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ, ఒక్కసారి ఛాన్స్‌ వచ్చాకా ఇరగదీస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన ఫ్రేజర్‌ యావరేజ్‌ 44.14 యావరేజ్‌, 235.88 స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేశాడు. అందులో ఏకంగా నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 30 ఫోర్లు, 26 సిక్సులు బాదాడు. వీటన్నింటి కంటే.. అతని ఇంటెంట్‌ అద్భుతంగా ఉంది. ఓపెనర్‌గా పవర్‌ ప్లేలో ఎలా ఆడాలో అలా ఆడి చూపిస్తున్నాడు.

అయితే.. మరి ఇంత బాగా ఆడుతున్నా.. జూన్‌ 2 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు అతన్ని ఎందుకు టీమ్‌లో తీసుకోలేదంటే.. దానికి ఒక కారణం ఉంది. ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ ఫామ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా అసలు లెక్కలోకే తీసుకోదు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణిస్తేనే వాళ్లను జాతీయ జట్టులోకి తీసుకుంటుంది. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌.. ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదు. కానీ, మిచెల్‌ మార్ష్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో ఆసీస్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌ లాంటి ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో ఓ కుర్రాడు బాగా ఆడినంత మాత్రానా.. అతన్ని తీసుకొచ్చి టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో ఆడించదు ఆస్ట్రేలియా. వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయి. అందుకే అన్ని వరల్డ్‌ కప్‌లు గెలిచారు. అదే ఇండియాలోనో, పాకిస్థాన్‌లోనూ ఓ కుర్రాడు బాగా ఆడితే చాలు.. మీడియాలో వచ్చే హైప్‌ చూసి.. అతనికి వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు ఇచ్చేస్తారు. తీరా.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో ఉంటే ఒత్తిడికి వాళ్లు చిత్తవుతూ ఉంటారు. ఆ తప్పు ఆస్ట్రేలియా అస్సలు చేయదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న జేక్‌ ఫ్రేజర్‌ను టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి