iDreamPost
android-app
ios-app

Will Jacks: ఈ మెరుపు ఇన్నింగ్స్ కు కారణం విరాట్ కోహ్లీ.. విల్ జాక్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Apr 29, 2024 | 10:01 AM Updated Updated Apr 29, 2024 | 10:01 AM

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు శతకంతో చెలరేగి ఆర్సీబీకి రికార్డ్ విజయాన్ని అందించాడు విల్ జాక్స్. అయితే తన సంచలన బ్యాటింగ్ కు కారణం విరాట్ కోహ్లీనే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు జాక్స్. ఆ వివరాల్లోకి వెళితే..

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు శతకంతో చెలరేగి ఆర్సీబీకి రికార్డ్ విజయాన్ని అందించాడు విల్ జాక్స్. అయితే తన సంచలన బ్యాటింగ్ కు కారణం విరాట్ కోహ్లీనే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు జాక్స్. ఆ వివరాల్లోకి వెళితే..

Will Jacks: ఈ మెరుపు ఇన్నింగ్స్ కు కారణం విరాట్ కోహ్లీ.. విల్ జాక్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణ ప్రదర్శనతో దాదాపు ప్లే ఆఫ్స్ కు దూరమైంది. ఇక ఈ సీజన్ లో వరుసగా ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ గెలుపు మామూలుది కాదు. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ విజయం ఇది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్ లో అద్వితీయమైన శతకంతో అదరగొట్టాడు విల్ జాక్స్. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అసలు ఈ మ్యాచ్ లో జాక్స్ సెంచరీ చేస్తాడని అతడితో పాటుగా ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు. అయితే తాను 50 To 100 సాధించడానికి కారణం వాళ్లిద్దరే అని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

విల్ జాక్స్.. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో శివతాండం చేశాడు. గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లో దంచికొట్టింది ఆర్సీబీ. ఇక ఈ మ్యాచ్ లో 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో 100 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విల్ జాక్స్. అతడి బ్యాటింగ్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. జాక్స్ తన తొలి ఫిఫ్టీని 31 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత గేర్ మార్చి ఆడిన జాక్స్.. వంద మార్క్ ను చేరుకోవడానికి కేవలం 10 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో 29 రన్స్, ఆ తర్వాత రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో 28 రన్స్ పిండుకుని మ్యాచ్ ను ముగించేశాడు. కాగా.. తాను 50 నుంచి 100 కు చేరుకోవడానికి వాళ్లిద్దరే కారణం అంటూ విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ పేర్లు చెప్పడం అందరిని ఆశ్యర్యపరిచింది.

The reason for this lightning innings is Virat Kohli

మ్యాచ్ అనంతరం విల్ జాక్స్ మాట్లాడుతూ.. “ప్రత్యర్థిపై భారీ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో నేను ఇంతగా చెలరేగడానికి కారణం విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ లే. వారిద్దరు ఇచ్చిన శుభారంభం వల్లే నేను స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాను. ఇక నేను ఇబ్బంది పడినప్పుడు కోహ్లీ భారీ షాట్స్ ఆడి నాపై ఒత్తిడి తగ్గించాడు. అదీకాక తొలి 17 బంతుల్లో 17 పరుగులు చేసిన నేను ఇలా హిట్టింగ్ చేయడానికి ప్రధాన కారణం అవతల ఎండ్ లో దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉండటమే. సరిగ్గా రెండు ఓవర్లు మావైతే.. మ్యాచ్ ను ముగించేయోచ్చు అని టై అవుట్ సమయంలో నేను, కోహ్లీ మాట్లాడుకున్నాం.  అలాగే చేశాం. అయితే స్పిన్ ను ఎదుర్కొవడంలో గతంలో ఇబ్బందిపడ్డాను. కానీ ఇప్పుడు పాజిటీవ్ గా ఆడుతూ పరుగులు రాబడుతున్నా” అంటూ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు జాక్స్.

కాగా.. చివర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి బంతిని సింగిల్ తీసి స్ట్రైక్ జాక్స్ కు ఇచ్చి సెంచరీకి సహకరించాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరి ఈ థండర్ ఇన్నింగ్స్ కు కారణం విరాట్ కోహ్లీ అన్న విల్ జాక్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.