iDreamPost

వసూళ్లతో శ్రీదేవి గట్టెక్కుతుందా

వసూళ్లతో శ్రీదేవి గట్టెక్కుతుందా

సుధీర్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ దక్కించుకున్న శ్రీదేవి సోడా సెంటర్ ఓపెనింగ్స్ మరీ అదరలేదు కానీ తన రేంజ్ కు మించే వచ్చాయని చెప్పొచ్చు. 8 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం ట్రైలర్ చూసే నమ్మకం పెంచుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మొత్తాన్ని లెక్క చేయలేదు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నట్టు అనిపించడంతో పాటు ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రమోషన్ పరంగా బాగా కేర్ తీసుకోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూ చేయడం, మహేష్ బాబు నిన్న సుదీర్ఘమైన ట్వీట్లు పెట్టడం తదితరాలు బజ్ విషయంలో ఏ లోటు లేకుండా చూసుకున్నాయి.

ఇవన్నీ పక్కనపెడితే రెండు రోజులకు గాను శ్రీదేవి సోడా సెంటర్ సుమారు 2 కోట్ల 25 లక్షల దాకా రాబట్టింది. ఇదేమంత భారీ ఫిగర్ కాదు కానీ ఉన్నంతలో ఇతర సినిమాలతో పోలిస్తే చాలా మెరుగు. నెగటివ్ రివ్యూలు, పబ్లిక్ టాక్ ఏమంత గొప్పగా లేకపోవడం ప్రతికూలంగా మారుతున్నాయి. వచ్చే వారం విడుదల కావలసిన సీటిమార్ వాయిదా పడటాన్ని సుధీర్ బాబు ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. జనానికి బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు రెండు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీని తర్వాత రాజరాజ చోర రెండో స్థానంలో ఉంది. మిగిలినవాటి పరిస్థితి గురించి చెప్పడానికి ఏమి లేదు. మొక్కుబడిగా థియేటర్లలో ఉన్నాయి.

సో ఇప్పుడీ సోడా సెంటర్ ముందు ఇంకా 6 కోట్ల కు పైగా టార్గెట్ ఉంది. ఇదంత సులభం మాత్రం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి దీన్ని ఫుల్ చేయడం ఈజీ కాదు. ఎంటర్ టైనర్ కాకపోవడంతో పాటు సీరియస్ డ్రామా అవ్వడం వల్ల మాస్ కి సైతం పూర్తిగా కనెక్ట్ కావడం లేదు. సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ ని వాడుకునే ఉద్దేశంతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించే ప్రయత్నం చేసిన దర్శకుడు కరుణ కుమార్ అందులో సఫలం కాలేకపోయారు. మరి ప్రతికూలతల మధ్య ఈ సోడా అంత లక్ష్యాన్ని చేరుకోవాలంటే బాగా కష్టపడాలి. ఇవాళ వీకెండ్ హాలిడే ఎంత రాబట్టుకుంటుందనేది చాలా కీలకం. రేపటికి ఒక అవగాహనకు రావొచ్చు చూద్దాం

Also Read : టైటిల్ కార్డులకే మూడు కోట్లా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి