iDreamPost

T20 World Cup: అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు బుమ్రా! కష్టం ఒక్కటే.. గౌరవం ఒకేలా దక్కుతుందా?

  • Published Jun 11, 2024 | 2:38 PMUpdated Jun 11, 2024 | 2:38 PM

Jasprit Bumrah, Virat Kohli, IND vs PAK, T20 World Cup 2024: ఒకే విధమైన కష్టం పడినప్పుడు ఒకే విధమైన గౌరవం, ప్రతి ఫలం దక్కాలని కోరుకుంటాం. మరి కోహ్లీకి దక్కిన గౌరవం, ఇప్పుడు బుమ్రాకు దక్కుతుందా? అనే ప్రశ్న ఎదురువుతోంది. ఇంతకీ వారిద్దరు పడ్డ కష్టం ఏంటి? కోహ్లీకి దక్కిన గౌరవం ఏంటి? బుమ్రాకు దక్కాల్సిన గౌరవం ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం..

Jasprit Bumrah, Virat Kohli, IND vs PAK, T20 World Cup 2024: ఒకే విధమైన కష్టం పడినప్పుడు ఒకే విధమైన గౌరవం, ప్రతి ఫలం దక్కాలని కోరుకుంటాం. మరి కోహ్లీకి దక్కిన గౌరవం, ఇప్పుడు బుమ్రాకు దక్కుతుందా? అనే ప్రశ్న ఎదురువుతోంది. ఇంతకీ వారిద్దరు పడ్డ కష్టం ఏంటి? కోహ్లీకి దక్కిన గౌరవం ఏంటి? బుమ్రాకు దక్కాల్సిన గౌరవం ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published Jun 11, 2024 | 2:38 PMUpdated Jun 11, 2024 | 2:38 PM
T20 World Cup: అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు బుమ్రా! కష్టం ఒక్కటే.. గౌరవం ఒకేలా దక్కుతుందా?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్‌ సేన.. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ జస్ప్రీత్‌ బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌పై బుమ్రా తన ప్రతాపం చూపించి.. టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఐర్లాండ్‌పై 3 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌పై 4 ఓవర్లలో కేవలం 14 రన్స్‌ ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాక్‌పై బుమ్రా చేసిన ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. అయితే.. పాక్‌పై ఏ భారత ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేసినా అతను హీరో అవుతాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌పై 82(నాటౌట్‌) పరుగుల ఇన్నింగ్స్‌ ఆడి, హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో చివర్లో రెండు సిక్సులు బాది టీమిండియా గెలిపించి విరాట్‌ కోహ్లీ హీరోగా మారాడు. అప్పటికే కోహ్లీకి ఉన్న స్టార్‌డమ్‌కు అతను ఆడిన ఇన్నింగ్స్‌ తోడైంది. ఒక ఏడాది పాటు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ గురించి క్రికెట్‌ అభిమానులు చర్చించుకున్నారు. కోహ్లీ గొప్పతనంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. 2022 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ గురించే క్రికెట్‌ లోకం మాట్లాడుకుంది. ఇండియా-పాకిస్థాన్‌ అంటే చాలు.. హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు, కోహ్లీ మ్యాచ్‌ గెలిపించిన తీరు గురించి చర్చ వచ్చేది. టెలివిజన్‌, ఐసీసీ, బీసీసీఐ అన్ని కూడా కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాయి.

Kohli vs BUmrah

అయితే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో అదే పాకిస్థాన్‌ జట్టుపై జస్ప్రీత్‌ బుమ్రా ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించాడు. 119 పరుగులు స్వల్ప టార్గెట్‌ను బుమ్రా లేకుండా టీమిండియా కాపాడుకోగలదా అంటే వందలో ఏ ఒక్కరు కూడా అవును కాపాడుకోగలదు అనే సమాధానం ఇవ్వకపోవచ్చు. 2022లో పాక్‌పై కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ ఎంత గొప్పదో, ఇప్పుడు పాక్‌పై బుమ్రా వేసిన నాలుగు ఓవర్లు కూడా అంతే గొప్పవి. ఓడిపోయే మ్యాచ్‌లలో ఇద్దరూ టీమిండియాను గెలిపించారు. కానీ, ఇద్దరికీ ఒకేలాంటి గౌరవం దక్కుతుందా? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. దాదాపు రెండేళ్లుగా కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడిన మీడియా, మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్ట్‌లు, బీసీసీఐ.. అదే రేంజ్‌లో మరో రెండేళ్లు బుమ్రా వేసిన బౌలింగ్‌ గురించి అంతే గొప్పగా చెప్పుకుంటాయా? లేదా అని కొంతమంది క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు. ఇక్కడ కోహ్లీని ఎక్కువ పొగిడేశారా? అనేది అస్సలు పాయింట్‌ కాదు.. కేవలం బుమ్రా కష్టానికి కూడా అంతే ప్రతిఫలం దక్కాలనే ఆకాంక్ష. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి