iDreamPost

BJP, Ayodhya: అయోధ్య రామ మందిరం.. BJPని మూడోసారి అధికారంలోకి తెస్తుందా?

  • Published Jan 24, 2024 | 4:25 PMUpdated Jan 24, 2024 | 4:25 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశంలోని హిందువులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే.. ఈ మందిర 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కలిసివస్తుందనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశంలోని హిందువులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే.. ఈ మందిర 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కలిసివస్తుందనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 24, 2024 | 4:25 PMUpdated Jan 24, 2024 | 4:25 PM
BJP, Ayodhya: అయోధ్య రామ మందిరం.. BJPని మూడోసారి అధికారంలోకి తెస్తుందా?

అయోధ్యలోని రామజన్మ భూమిలో రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో ఒక్కసారిగా దేశం మొత్తం అయోధ్య వైపు చూసింది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యారు. దేశం మొత్తం టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించింది. అయితే.. ఈ రామమందిర కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీజేపీ రామమందిరాన్ని హడావుడిగా, నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించింటూ విమర్శలు వస్తున్నాయి. రామమందిరాన్ని బీజేపీ ఇప్పుడే ఎందుకు ప్రారంభించింది అనే విషయాన్ని పక్కనపెడితే.. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ప్రారంభించిందనే అంశాన్ని పరిశీలిస్తే.. అసలు బీజేపీకి రామమందిరం 2024 లోక్‌సభలో నిజంగానే ఓట్లు కురుపిస్తుందా? లేదా? దీనిపై రాజకీయా విశ్లేషకులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే డిమాండ్‌ ఇప్పటిది కాదు.. దాదాపు 500 ఏళ్ల నుంచి ఉంది. బీజేపీ పుట్టక ముందు నుంచే రామజన్మ భూమి అయిన అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే డిమాండ్‌ ఉంది. అయితే.. బీజేపీ ఏర్పాటు తర్వాత రామ మందిరం కోసం చాలా గట్టిగా పోరాటం చేసిందనే నిజాన్ని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. రామ మందిర నిర్మాణం తమ ప్రాథమిక అజెండా అని బీజేపీ ఎప్పుడో ప్రకటించింది. దాని కోసం బీజేపీ నేతలు అనేక పోరాటాలు చేసి, వివాదాస్పద అంశంలోనూ న్యాయబద్ధంగానే గెలిచి.. ఎట్టకేలకు అయోధ్యలో ఎక్కడైతే రామ మందిరం నిర్మించాలనే డిమాండ్‌ ఉందో.. సరిగ్గా అదే ప్లేస్‌లో మందిరం నిర్మించి.. బాల రాముడిని ప్రతిష్ఠించారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని 80 శాతం హిందువులను ఒక్కతాటికి పైకి తెచ్చింది. ఈ మందిర నిర్మాణంలో బీజేపీ దాని అనుబంధం సంస్థలకే క్రెడిట్‌ దక్కుతుంది. మందిర నిర్మాణ క్రెడిట్‌ను వాళ్లు ఓన్‌ చేసుకోవడంలో కూడా తప్పులేదు.

అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరాన్ని చూసి బీజేపీకి హిందువులు ఓటు వేస్తారా? అంటే వేస్తారనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఏదైనా ఒక అంశం దేశ ప్రజలందరినీ ఒకే వైపు నడిపించే సమయంలో అది కచ్చితంగా రాజకీయంగాను కలిసివస్తుంది. అది ఎలాంటి ఉద్యమమైనా సరే. అయితే అది అన్ని సందర్భాల్లోనూ వర్క్‌ అవుట్‌ అవుతుందా అంటే కొన్ని సార్లు అలా జరగకపోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత.. యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, కాన్షీరాం, ములాయం సింగ్‌ యాదవ్‌ జతకట్టడంతో బీజేపీకి అధికారం దక్కలేదు.

ఇప్పటికే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వరుసగా మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. దాని కోసం కలిసివచ్చే అన్ని సానుకూల అంశాలను కచ్చితంగా వాడుకుంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది అదే. అందులో రామమందిర నిర్మాణ క్రెడిట్‌ కూడా ఉండొచ్చు. ప్రజలు బలంగా కోరకున్నది చేసి.. దాని నుంచి లబ్ధిపొందడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ నేపథ్యంలో రామమందిర వైబ్రేషన్స్‌ను దాటి.. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. మరి అయోధ్య రామమందిర నిర్మాణం.. బీజేపీ ఏ మేర ప్రయోజనం చేకూరుస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి