iDreamPost

రైల్వే దుప్పట్లు కొట్టేసిన భర్త.. పోలీసులకు పట్టించిన భార్య!

చాలా మంది మహిళలు.. తమ భర్త ఎంత పెద్ద తప్పు చేసిన బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెడతారు. కొందరు మాత్రం తప్పు చేసింది భర్త అయినా మరేవరైనా..శిక్ష పడాల్సిందే అంటూ సమాజం కోసం ఆలోచిస్తుంటారు. అలాంటి ఓ మహిళ తప్పు చేసిన తన భర్తను పోలీసులకు పట్టించింది.

చాలా మంది మహిళలు.. తమ భర్త ఎంత పెద్ద తప్పు చేసిన బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెడతారు. కొందరు మాత్రం తప్పు చేసింది భర్త అయినా మరేవరైనా..శిక్ష పడాల్సిందే అంటూ సమాజం కోసం ఆలోచిస్తుంటారు. అలాంటి ఓ మహిళ తప్పు చేసిన తన భర్తను పోలీసులకు పట్టించింది.

రైల్వే దుప్పట్లు కొట్టేసిన భర్త.. పోలీసులకు పట్టించిన భార్య!

సాధారణంగా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా సంసారం జీవితాన్ని సాగిస్తుంటారు. చిన్న చిన్న సమస్యలు వచ్చిన సర్థుకుపోతూ కాపురాన్ని హాయిగా సాగిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది భార్యలు తమ భర్త ఎలా ఉన్నా కూడా సర్థుకుని పోతుంటారు. తమ భర్త ఎంత పెద్ద తప్పు చేసిన కూడా బయటకు చెప్పకుండా రహస్యంగానే ఉంచుతారు. కానీ కొందరు భార్యలు మాత్రం భర్త అయితే..తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒక్కటే అనే భావనలో ఉంటారు. అందుకే తప్పు చేసిన తమ భర్తను పోలీసులకు పట్టిస్తుంటారు కొందరు. అలాంటి ఓ మహిళ..తన భర్త చేసిన తప్పును పోలీసులకు చెప్పి.. చివరకు అరెస్టు చేయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మహ్మద్ అర్షద్ అనే యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు ఐటీ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మంచి జీతం, ఉన్నతమైన పోజిషన్ తో అర్షద్ సంతోషంగా ఉన్నాడు. ఇక కంపెనీ పని మీద అర్షద తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లుండే వాడు. సదరు సంస్థలో అతడు పెద్ద ఎంప్లాయిస్ కావడంతో అర్షద్ కి రైల్లో ఫస్ట్ క్లాస్ సదుపాయాలతో జర్నీ సాగుతుంది. ఇలా చాలా రోజుల పాటు అర్షద్ కంపెనీ పని మీద రైల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వాడు. ఈ సీన్ కట్ చేస్తే..

రెండు నెలల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ  ప్రాంతానికి చెందిన అమ్మాయితో అర్షద్ వివాహం జరిగింది. వీరి పెళ్లి  అనంతరం ఆ అమ్మాయిను తీసుకుని భోపాల్ వచ్చాడు. ఈ కొత్త జంట భోపాల్ లోనే కాపురం పెట్టారు. రంజాన్ మాంస కావడంతో ఆ ఇల్లాలు ఇంటిని శుభ్రం చేయాలని భావించింది. ఈ క్రమంలోనే భర్త ఆఫీస్ కు వెళ్లిన తరువాత ఇంటిని శుభ్రం చేసే పనిని ప్రారంభించింది. ఇలా ఇంట్లోనే అన్ని గదులను క్లీన్ చేసింది. చివరగా మిగిలిన వారి బెడ్ రూమ్ గదిలోకి శుభ్రం చేసేందుకు వెళ్లింది.

ఆ గదిలో శుభ్రం చేస్తుండగా.. ఓ మూలన పెద్ద షూట్ కేసు కనిపించింది. తొలుత ఆశ్చర్యంగా చూసిన ఆ ఇల్లాలు..దాని దగ్గరికి వెళ్లి.. ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేసి చూసిన సదరు మహిళ ఆశ్చర్యానికి లోనైంది. అందులో రైల్వేశాఖకు చెందిన వస్తువులు కనిపించాయి. ఐఆర్టీసీ లోగ్ ఉన్న పలు వస్తువులు ఆ షూట్ కేసులో కనిపించాయి. ఆరు దుప్పట్లో, 30 టవల్లు, 40 బెడ్ షీట్లు కనిపించాయి. దీంతో తన భర్త.. ఇలా క్యాంపులకు వెళ్లిన ప్రతిసారీ రైల్లోని వస్తువులను దొంగిలిస్తున్నాడని గ్రహించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో ఆ విషయం గురించి డిష్క్రషన్ చేసింది.

ట్రైన్ లో దొంగిలించిన వస్తువులను తిరిగి వారికి అప్పగించాలని భర్తకు చెప్పింది. అయితే ఆయన అందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ దుప్పట్లను ఫోటోలు తీసి.. పోలీసులకు  ఫార్వాడ్ చేసింది. దీంతో వారు అర్షద్ ఇంటికి చేరుకుని ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక రైల్వే వస్తువులను దొంగిలించిన అర్షద్ ను అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చిన తరువాత తన కాపురం చేస్తాడా ? అని కొందరు ఆ మహిళను ప్రశ్నించగా.. అలా తప్పులు చేసి వాడితో జీవించే కన్నా ఒంటరిగా ఉండటం మేలని ఆమె చెప్పడం గమన్హరం. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి