iDreamPost

ఇషా ఆశ్రమంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు స్టార్స్.. ఇక్కడే ఫేమస్ ఎందుకు?

మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శైవ క్షేత్రాలన్ని శివనామ స్మరణతో మారుమ్రోగాయి. భక్తులు శివయ్యకు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి శివు భక్తిలో మునిగితేలుతున్నారు.

మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శైవ క్షేత్రాలన్ని శివనామ స్మరణతో మారుమ్రోగాయి. భక్తులు శివయ్యకు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి శివు భక్తిలో మునిగితేలుతున్నారు.

ఇషా ఆశ్రమంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు స్టార్స్.. ఇక్కడే ఫేమస్ ఎందుకు?

మహాశివరాత్రి వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే పరమ శివుడి భక్తులు శివాలయాలకు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగిపోయాయి. ఉపవాస దీక్ష, జాగారాలతో శివుడి కటాక్షం కోసం దీక్షను ఆచరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. ఇక మహా శివరాత్రి అనగానే ఇషా ఆశ్రమంలో జరిగే వేడుకలే గుర్తొస్తాయి. ప్రతీ ఏడు ఇక్కడ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయి. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తారు. మరి ఈ ఆశ్రమంలోనే మహాశివరాత్రి వేడుకలు ఫేమస్ ఎందుకంటే?

గత కొన్ని సంవత్సరాల కాలంగా ఇషా ఫౌండేషన్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వార్యంలో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. తమిళనాడులోని ఐకానిక్ ఆదియోగి విగ్రహం ముందు జరిగే ఈ వేడుకలు ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఈవెంట్‌లలో ఒకటిగా మారింది. ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి వేడుకల్లో సద్గురు మార్గదర్శకత్వంలో ధ్యాన సెషన్‌లు, సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఆద్యాత్మిక ఫౌండేషన్ కు దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు సందర్శిస్తుంటారు. భాషలకతీతంగా భక్తులందరు ఒక్కచోట చేరి శివుడి భక్తిలో మునిగితేలుతుంటారు.

ఇషా ఫౌండేషన్ లో జరిగే ఈ వేడుకలు చూస్తుంటే నిజంగానే శివుడు కొలువై ఉన్న కైలాసంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందంటుంటారు భక్తులు. మహాశివరాత్రి వేడుకలకు స్టార్స్, సెలబ్రిటీలు కూడా హాజరవుతుండడంతో ఇషా ఫౌండేషన్ మరింత ఫేమస్ అయ్యింది. దేశ వ్యాప్తంగా జరిగే వేడుకలు ఒకెత్తైతే ఇషా ఫౌండేషన్ లో జరిగే వేడుకులు మరో లెవల్ లో ఉంటాయి. ఆదియోగి విగ్రహం ముందు శివుడి పాటలతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోతుంటారు. ఇక్కడ ఏడాదికోసారి జరిగే మహాశివరాత్రి వేడుకలను తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శైవ క్షేత్రాలకు సమానంగా.. ఆధ్యాత్మికతకు మారు పేరుగా ఇషా ఫౌండేషన్ ఉండడంతో ఇక్కడ జరిగే మహా శివరాత్రి వేడుకలు ఫేమస్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి