iDreamPost

ప్రశంసలు వచ్చాయి.. ‘జై భీమ్’కి అవార్డులు ఎందుకు రాలేదు?

  • Author ajaykrishna Updated - 03:25 PM, Fri - 25 August 23
  • Author ajaykrishna Updated - 03:25 PM, Fri - 25 August 23
ప్రశంసలు వచ్చాయి.. ‘జై భీమ్’కి అవార్డులు ఎందుకు రాలేదు?

ప్రస్తుతం ఇండియా అంతా నేషనల్ అవార్డుల గురించి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సినిమాలకు అవార్డులు అవార్డులు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు.. మరికొన్ని సినిమాలకు అవార్డులు రాకపోవడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఏకంగా తెలుగు ఇండస్ట్రీకి ఈసారి 10 అవార్డులు లభించాయి. దీంతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఓవైపు పుష్ప సినిమాకు అవార్డులు వచ్చినందుకు ఆనందిస్తుండగా.. మరోవైపు తమిళ ప్రేక్షకులు ‘జై భీమ్’ సినిమాకు ఎందుకు రాలేదని ఆరాలు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

2021లో జై భీమ్ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది. సోషల్ ఇష్యూస్ నేపథ్యంలో కోర్ట్ రూమ్ డ్రామాగా టిజే జ్ఞానవెల్.. జై భీమ్ ని రూపొందించాడు. అయితే.. ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ.. జై భీమ్ కి తమిళ, తెలుగు ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభించింది. విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. ఆ టైమ్ లో ఈ సినిమాకు.. లేదా సినిమాలో క్యారెక్టర్స్ కి అయినా నేషనల్ అవార్డులు వస్తాయని భావించారు. కానీ.. అనూహ్యంగా బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ ని వరించింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. అవార్డులు వస్తాయి అనుకున్న జై భీమ్ కి ఏ విభాగంలోను రాలేదు.

ఇప్పుడు జై భీమ్ సినిమాకు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. జై భీమ్ కి ఎందుకు రాలేదనే విషయంపై కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెస్ట్ యాక్టర్ అవార్డుకు అల్లు అర్జున్ పూర్తిగా అర్హుడే. అయినా.. సూర్య కూడా అర్హుడే అని కొందరి వాదన. అయితే.. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఎప్పుడైనా సరే సినిమాలో క్యారెక్టర్ వెయిటేజ్ కూడా దృష్టిలో పెట్టుకుంటారని చెబుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కి.. జై భీమ్ లో సూర్య క్యారెక్టర్ కి మధ్య వేయిటేజ్.. వాటి వెనుక స్కిల్స్.. క్యారెక్టర్ కి జరిగిన జస్టిఫికేషన్ అన్ని పరిగణలోకి తీసుకుంటారని ఇంకొందరి సమాధానం. ఇదిగాక అంతకుముందు ఆకాశం నీ హద్దురా మూవీకి సూర్య బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. సో.. వరుసగా రెండోసారి కూడా ఇవ్వరని అనుకుంటున్నారు. మరి కారణాలు ఏవైనా సౌత్ అంతా ఒక్కటే కాబట్టి.. ఎవరికి వచ్చినా సంతోషించాల్సిన విషయమే. మరి నేషనల్ అవార్డుల విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి