iDreamPost

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లని బట్టి.. ఏ టీమ్స్‌కి కప్పు కొట్టే ఛాన్స్‌లు ఉన్నాయి?

  • Published Apr 17, 2024 | 3:40 PMUpdated Apr 17, 2024 | 3:40 PM

IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్‌ల వరకు ముగిశాయి. దీంతో ఏ టీమ్‌ ఎలా ఆడుతోంది అర్థమైపోయింది. ఈ లెక్క ఏ టీమ్స్‌కు కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయో క్రికెట్‌ పండితులు తేల్చేస్తున్నారు. ఆ టీమ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం..

IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్‌ల వరకు ముగిశాయి. దీంతో ఏ టీమ్‌ ఎలా ఆడుతోంది అర్థమైపోయింది. ఈ లెక్క ఏ టీమ్స్‌కు కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయో క్రికెట్‌ పండితులు తేల్చేస్తున్నారు. ఆ టీమ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 17, 2024 | 3:40 PMUpdated Apr 17, 2024 | 3:40 PM
ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లని బట్టి.. ఏ టీమ్స్‌కి కప్పు కొట్టే ఛాన్స్‌లు ఉన్నాయి?

ఐపీఎల్‌ 2024 సీజన్‌ అద్భుతంగా సాగుతోంది. అన్ని టీమ్స్‌ హోరాహోరీగా పోరాడుతున్నాయి. గతంలో కనీవిని ఎరుగని రీతిలో అతి భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. మంచి నీళ్లు తాగినంత సులభంగా ఆటగాళ్లు సిక్సులు బాదుతూ.. సెంచరీల మీద సెంచరీలు నమోదు చేస్తున్నారు. ఈ సీజన్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బ్యాటర్లు పండగ చేసుకుంటుంటే.. క్రికెట్‌ అభిమానులు అసలు సిసలైన క్రికెట్‌ మజాను ఆస్వాదిస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్రతి టీమ్‌ ఆరేసి మ్యాచ్‌లు ఆడేశాయి. దాదాపు ప్రతి సత్తా ఏంటో.. ఏ టీమ్‌ ఎంత బలంగా ఉందో.. ఏ టీమ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో.. అందరికీ అర్థమైపోయింది. దాదాపు సగం మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలించి.. ఓ నాలుగు టీమ్స్‌కు కప్పు కొట్టే ఛాన్స్‌ ఉందనే అభిప్రాయాలు క్రికెట్‌ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఆ నాలుగు టీమ్స్‌ ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్‌లో బరిలోకి దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అందర్ని నిరాశపరుస్తూ.. 7 మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆర్సీబీ 6 ఓటములు పొందింది. దీంతో.. ఈ సారి ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌ను ఆర్సీబీ గెలవాలి. దీంతో.. ఈ టైటిల్‌ ఫేవరేట్స్‌ నుంచి ఆర్సీబీని పక్కనపెట్టొచ్చు. ఇక టైటిల్‌ రేసులో.. ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లను కూడా పక్కన పెట్టొచ్చని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఈ జట్లు ఆరేసి మ్యాచ్‌లు ఆడిన 2 విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టిలో 9, 8, 7వ స్థానాల్లో ఉన్నాయి. ఒక గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు.. 6 మ్యాచ్‌ల్లో మూడేసి విజయాలు, మూడేసి పరాజయాలు నమోదు చేశాయి. ఈ జట్లకు ప్లే ఆఫ్‌ ఆశలు ఉన్నా.. కప్పు కొట్టేంత సీన్‌ అయితే కనిపించడం లేదు. మొత్తం కప్పు కొట్టే జాబితాలో ఈ ఆరు టీమ్స్‌ను పక్కనపెట్టొచ్చు.

ఇక కప్పు కొట్టేలా కనిపిస్తున్న నాలుగు టీమ్స్‌ విషయానికి వస్తే.. ముందుగా మన హోం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా ఇదే సీజన్‌లో రెండు సార్లు నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ అంటేనే ప్రత్యర్థి జట్టు బౌలర్లు భయపడుతున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ 4 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రతి సీజన్‌లోనూ టైటిల్‌ ఫేవరేట్‌గా ఉండే సీఎస్‌కే ఈ సీజన్‌లో కూడా దుమ్మురేపుతోంది. 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

గంభీర్‌ మెంటర్‌గా వచ్చిన తర్వాత కేకేఆర్‌ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే 6 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు సాధించి.. మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక ప్రస్తుతం నంబర్‌ వన్‌ స్థానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఉంది. 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో దాదాపు ప్లే ఆఫ్‌కు చేరిపోయినట్లే. మొత్తంగా ప్రస్తుతం టాప్‌ ఫోర్‌లో ఉన్న ఆర్‌ఆర్‌, కేకేఆర్‌, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లలోనే ఓ టీమ్‌ టైటిల్‌ ఎగరేసుకుని పోతుందని క్రికెట్‌ పండితులు భావిస్తున్నారు. అలాగని వేరే టీమ్స్‌కి అవకాశం లేదని కాదు. వాటికి కూడా అవకాశం ఉన్నా.. పైగా నాలుగు టీమ్స్‌ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ.. గట్టి పోటీ ఇస్తున్నాయి. మిగతా టీమ్స్‌లో పోలిస్తే.. వారికే ఎక్కువ ఛాన్స్‌ ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి