iDreamPost

సంక్రాంతి తేదీల్లో లాభమెవరికి నష్టమెవరికి?

సంక్రాంతి తేదీల్లో లాభమెవరికి నష్టమెవరికి?

అన్ని సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేశాయి. నిన్నటి దాకా దోబూచులాడిన వారసుడు తెగింపులు జనవరి 11 ఢీ కొట్టాలని డిసైడైపోయాయి. రాత్రికి రాత్రి అనౌన్స్ మెంట్లు ఇచ్చేయడంతో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలు పది రోజుల క్రితమే మొదలుపెట్టిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 12కి అమ్మిన టికెట్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా అమ్మకాలు మొదలుపెట్టారు. తెలుగు విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య కన్నా వీరసింహారెడ్డి సేల్స్ లో కొంచెం ఆధిక్యంలో ఉంది. దీనికేవో కారణాలు సోషల్ మీడియాలో చెబుతున్నారు కానీ ఫిగర్లే సాక్ష్యాలు కాబట్టి ప్రస్తుతానికి బాలయ్యదే పైచేయిగా కనిపిస్తోంది. ఇంకా చాలా షోలు ఓపెన్ చేయాల్సి ఉంది కనక మార్పులుంటాయి

ఇక లాభ నష్టాల విషయానికి వస్తే ఎక్కువ అడ్వాంటేజ్ అజిత్ విజయ్ లకు దక్కనుంది. ఎందుకంటే పదకొండున ఎలాగూ తమిళనాడులో అరాచకం ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. ఆ రోజు ఏపీ తెలంగాణలో ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని ఈజీగా దొరుకుతాయి. వీరసింహారెడ్డి వచ్చేది మరుసటి రోజు కాబట్టి ఎగ్జిబిటర్లు ఎన్ని స్క్రీన్లు కావాలన్నా వారసుడు తెగింపులకు ఇస్తారు. ఎలాగూ దిల్ రాజు రిలీజ్ కనక ఆయన వీలైనంత ఎక్కువ రాబట్టుకునేందుకు అన్ని రకాల స్కెచ్చులు వేస్తారు. ఒకవేళ దేనికి పాజిటివ్ టాక్ వచ్చినా ఆ రోజు నడిచే షోల వల్ల సాధ్యమైనంత ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. నెక్స్ట్ డే కౌంట్ తగ్గినా ఇబ్బంది లేదు

తెగింపు సంగతేమో కానీ వారసుడు మాత్రం ఎక్కువగానే హోల్డ్ చేసుకుంటుంది. వీరసింహారెడ్డికి చెప్పుకోదగ్గ కౌంట్ ఉంటుంది కానీ ఎటొచ్చి అన్యాయం జరిగేది ఈ లెక్కన వాల్తేరు వీరయ్యకే. ఉదాహరణకు నైజామ్ ఏరియాలో మొదటి రోజు వారసుడుకి 300 స్క్రీన్లు, తెగింపు 190 దాకా వస్తాయట. అదే బాలయ్య ఫస్ట్ డేకి 200 పై చిలుకు చిరుకి 190 నుంచి రెండువందలలోపే ఉంటాయని సమాచారం. టాక్ అండ్ రెస్పాన్స్ ని బట్టి తర్వాత మార్పులు చేర్పులు చేసుకుంటారేమో కానీ మైత్రి సంస్థ రెండిట్లో ఒకటైనా పదకొండుకి ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. వీటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు 6న ఒంగోలులో, 8న విశాఖపట్నంలో జరగనున్న సంగతి తెలిసిందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి