iDreamPost

బాలయ్యను నిలబెట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు!

ఎందుకంటే అఖండ ముందు ఆయన ఎన్నో ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలు కనీసం రూ.5-10 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాయి అంటే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎందుకంటే అఖండ ముందు ఆయన ఎన్నో ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలు కనీసం రూ.5-10 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాయి అంటే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బాలయ్యను నిలబెట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు!

నందమూరి బాలకృష్ణ సినిమాలకు విరామం ఇవ్వనప్పటికీ అఖండ నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని భావిస్తున్నారంతా. ఎందుకంటే అఖండ ముందు ఆయన ఎన్నో ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలు కనీసం రూ.5-10 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాయి అంటే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్టార్ హీరోల సినిమాలంటే మొదటిరోజే రూ.20-30 కోట్ల షేర్ వస్తాయి. అలాంటిది బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు ఫుల్ రన్ లో అందులో సగం కూడా కలెక్షన్లు రాలేదు. కొన్ని కొన్ని సినిమాలను అసలు విడుదల రోజు ఆయన అభిమానులే పట్టించుకోని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇక సామాన్య ప్రేక్షకులు ఏం చూస్తారు. అందుకే అంతటి ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు బాలకృష్ణ. అయినప్పటికీ సినిమాలకు మాత్రం విరామం ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఆయనకి అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ ఘన విజయం సాధించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. లాక్ డౌన్ దెబ్బకు థియేటర్లకు మొహం వాచిపోయిన ప్రేక్షకులు అఖండ చిత్రాన్ని చూడటానికి థియేటర్ల బాట పట్టారు. దీంతో రూ.75 కోట్ల షేర్ తో బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

ఓ వైపు అఖండ విజయం, మరోవైపు అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వడంతో.. బాలయ్య కెరీర్ పీక్స్ లో ఉందని సీనియర్ హీరోలు ఆయనకు పోటీ రాలేరని ఫ్యాన్స్ భావించారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటే అని ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య దెబ్బకు రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. విడుదలకు ముందు వంద కోట్ల షేర్ వస్తుందంటూ హడావుడి చేశారు. తీరా విడుదలయ్యాక బ్రేక్ ఈవెన్ కే కష్టపడుతోంది. అయినప్పటికీ బాలయ్య అభిమానులు ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే ఒకప్పటిలా పది కోట్ల లోపు షేర్ తో సరిపెట్టుకోకుండా 60 కోట్లకు పైగా షేర్ రాబట్టడం వారికి ఆనందించదగ్గ విషయం.

ఇక ఆ రేంజ్ నుంచి బాలకృష్ణను కిందకు దించకుండా ఉంచడం కోసం ఒక వర్గం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే పక్కా ప్లానింగ్ తో బడా దర్శకులతో, బడా బ్యానర్లలో సినిమాలు రూపొందేలా సన్నాహాలు జరగుతున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఇక వీరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బాలకృష్ణతో మరో చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల వీరసింహారెడ్డి వేడుకలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్ తాను త్వరలో బాలకృష్ణతో సినిమా చేస్తానని, ఇది తనతో పాటు, మా నిర్మాతలు మైత్రి మేకర్స్ కోరిక అని చెప్పాడు. అంటే దర్శకులకు చెప్పి మరీ బాలకృష్ణ కోసం కథలు రాయిస్తున్నారని అర్థమవుతోంది. అలాగే సితార బ్యానర్ సైతం బాలకృష్ణ కోసం దర్శకుడిని సెట్ చేసే పనిలో ఉంది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా నాలుగోసారి బాలయ్యతో జత కట్టడానికి సిద్ధమవుతున్నాడు. మళ్లీ బాలయ్య మార్కెట్ పడిపోకుండా, కనీసం రూ.60-70 కోట్లు కలెక్షన్లు వచ్చేలా జరుగుతున్న ఈ ప్రయత్నాలు, ప్రణాళికలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి