ప్రపంచంలోనే అతి పెద్ద మొత్తంలో ఒకేసారి భారీగా హెరాయిన్ పెట్టుబడడం కలకలం రేపుతోంది. గుజరాత్ లోని ముద్రా పోర్టులో ఏకంగా 3 టన్నుల హెరాయిన్ ని అధికారులు సీజ్ చేశారు. రెండు కంటైనర్ల నిండా డ్రగ్స్ స్మగ్లింంగ్ చేస్తుండడం విశేషంగా మారింది. సుమారుగా రూ. 9వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ఒకేసారి పట్టుబడటం అతి పెద్ద సంచలనంగా కనిపిస్తోంది. దేశంలోకి మాదక ద్రవ్యాలు ఎంత యధేేచ్ఛగా దిగుమతి అవుతున్నాయన్నది ఈ వ్యవహారం కళ్లకుగడుతోంది. ప్రస్తుతం కీలక నిందితులుగా చెన్నైలో నివాసం ఉంటున్న మాచవరం సుధాకర్. అతని భార్య వైశాలిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అయితే టాల్కమ్ పౌడర్ ముసుగులో ఇంత పెద్ద హెరాయిన్ ని ఓ సాధారణ వ్యక్తి తరలించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మాచవరం సుధాకర్ ది సొంతూరు తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి. ప్రస్తుతం అతని కుటుంబంలో కొందరు అక్కడే నివశిస్తున్నారు. తండ్రి పౌరహిత్యం చేసుకునేవారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ఆటో నడుపుకుంటూ తల్లితో కలిసి జీవిస్తున్నారు. సుధాకర్ మాత్రం కొంత చదువుకుని వైజాగ్, కోల్ కతా, చెన్నై వంటి ప్రాంతాల్లో పనిచేశారు. అక్కడే కస్టమ్స్, ఇతర వ్యవహారాల్లో ఆయనకు పరిచయాలు ఏర్పడడంతో మాఫియాతో చేతులు కలిపినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా విజయవాడలోని అత్తారింటిని అడ్రస్ గా చూపించి జీఎస్టీ సర్టిఫికెట్ తో పాటుగా దిగుమతులు, ఎగుమతులకు అనుమతి తీసుకున్నట్టు చెబుతున్నారు. గత ఏడాది ఆగష్టులో జీఎస్టీ సర్టిఫికెట్ పొందినట్టు ప్రకటించారు.
Also Read : అప్పుడు అష్టదిగ్బంధనం నేడు టాల్కం పౌడర్ .. నవ్వులపాలవుతున్నా మారని ఆ యాంకర్ వైఖరి
అయితే వివిధ లాజిస్టిక్స్ కంపెనీలలో ఓ స్థాయి ఉద్యోగిగా పనిచేసిన సుధాకర్ కి ఆప్ఘనిస్తాన్ నుంచి అంత పెద్ద మొత్తంలో హెరాయిన్ దిగుమతి చేసుకునేటంత అవకాశం ఉంటుందా అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఈ రాకెట్ లో చాలా పెద్ద తలకాయలే ఉంటాయన్నది కాదనలేని సత్యం. ఏపీకి చెందిన రాజకీయ పార్టీలలో కూడా ఇది చర్చ జరుగుతోంది. కానీ పదేళ్ళుగా రాష్ట్రానికి దూరంగా ఉంటున్న సుధాకర్ పూర్తిగా ఢిల్లీకి చెందిన కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతున్నారు. నిజానికి కేవలం సుధాకర్ భార్య పేరుతో తీసుకున్న జీఎస్టీ సహా ఇతర అనుమతిపత్రాలను కొందరు అడ్డంగా పెట్టుకుని ఈ వ్యవహారమంతా నడిపినట్టు కనిపిస్తోంది. ఈ మాఫియా వెనుక చాలా పెద్ద తలకాయలే ఉంటాయని భావిస్తున్నారు.
ఒకేసారి 3వేల టన్నుల హెరాయిన్ దేశంలోకి వచ్చిన తర్వాత పట్టుబడింది. కానీ ఇలాంటి దందా ఏ స్థాయిలో జరుగుతుందో అనేది ఊహిస్తేనే కంపరం పుడుతోంది. దేశంలో పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకాన్ని ఇది తెలియజేస్తోంది. మాఫియాలు చెలరేగిపోతున్న తీరుని చాటుతోంది. గుజరాత్ కేంద్రంగా దిగుమతి చేసుకుని ఢిల్లీకి సరఫరా చేస్తున్న వైనం ప్రమాదాన్ని సూచిస్తోంది. బడాబాబుల పాత్ర మీద పలు అనుమానాలు పెంచుతోంది. సుధాకర్ ని పావుగా వాడుకుని ఈ డ్రగ్స్ మాఫియా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ వ్యవహారంలో అసలు దోషులను దర్యాప్తు సంస్థలు ఏమేరకు బయటపెడతాయో చూడాలి. ఇప్పటికే వారం రోజులు దాటుతోంది. ఈ కేసు విచారణ ఏ రీతిలో సాగుతుందన్న దానిని బట్టి భవిష్యత్తులో దేశంలో డ్రగ్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయగలరా లేదా అన్నది తేలుతుంది.
Also Read : హెరాయిన్- ఆంధ్రప్రదేశ్ : బోడిగుండుకు మోకాలికి ముడిపెడుతున్న ఓ వర్గం మీడియా
ఈ మధ్య కాలంలో ట్లోల్ ప్లాజాల వద్ద దారుణాలు బాగా పెరిగిపోయాయి. యాక్సిడెంట్లు.. గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, ఓ టోల్ ప్లాజా వద్ద దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళపై టోల్ ప్లాజా సిబ్బంది దాడికి దిగారు. భర్త కళ్లముందే ఆమెను దారుణంగా చితకబాదారు. భర్తను కూడా వదల్లేదు. తాగి నడుపుతున్నారన్న కారణంతో ఈ ఘాతుకానికి తెగించారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనిపత్‌కు చెందిన ఓ […]