iDreamPost
android-app
ios-app

టేబుల్‌ టాపర్‌గా KKR..! ప్లే ఆఫ్స్‌కి వెళ్లే 4 జట్లు ఏవో తేలిపోయినట్టే!

  • Published May 02, 2024 | 3:02 PM Updated Updated May 06, 2024 | 10:17 AM

Playoffs, IPL 2024: ఐపీఎల్‌ 2024లో అన్ని టీమ్స్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌ గురించి అందరిలో ఆసకక్తి నెలకొంది. మరి ప్లే ఆఫ్స్‌కి వెళ్లే టీమ్స్‌ ఏమో ఇప్పుడు చూద్దాం..

Playoffs, IPL 2024: ఐపీఎల్‌ 2024లో అన్ని టీమ్స్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌ గురించి అందరిలో ఆసకక్తి నెలకొంది. మరి ప్లే ఆఫ్స్‌కి వెళ్లే టీమ్స్‌ ఏమో ఇప్పుడు చూద్దాం..

  • Published May 02, 2024 | 3:02 PMUpdated May 06, 2024 | 10:17 AM
టేబుల్‌ టాపర్‌గా KKR..! ప్లే ఆఫ్స్‌కి వెళ్లే 4 జట్లు ఏవో తేలిపోయినట్టే!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ అంచనాలకు మించి సాగుతోంది. ప్రతి టీమ్‌ విజయం కోసం ప్రాణం పెట్టి ఆడుతోంది. ఇప్పటికే ప్రతి టీమ్‌ దాదాపు 10 మ్యాచ్‌లు ఆడేసినా కూడా.. ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌ ఏవి అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. గతంలో సగం మ్యాచ్‌లు ముగిసిన టైమ్‌కి ప్లే ఆఫ్స్‌కి వెళ్లే టీమ్స్‌ ఏవో ఒక క్లారిటీ క్రికెట్‌ అభిమానుల్లో వచ్చేంది. కానీ, ఈ సీజన్‌లో మాత్రం ఇప్పటికీ 10 టీమ్స్‌కి కూడా ప్లే ఆఫ్‌ ఛాన్సులు ఉన్నాయి. అయితే.. అందులో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుకు చాలా సంక్లిష్టమైన ఛాన్సులుంటే.. మిగతా టీమ్స్‌ కాస్త మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఒక్క రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆర్‌ఆర్‌ 10 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పటిష్టస్థితిలో ఉంది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధిస్తే.. 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. మరి మిగిలిన మూడు స్థానాల్లో ఏఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి.. మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో ప్లేస్‌లో నిలిచింది. లక్నో సూపర్‌ జెయింగ్స్‌ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్స్‌ సాధించి ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ పదేసి పాయింట్లతో 6వ స్థానంలో, ఆర్సీబీ, పంజాబ్‌, జీటీ 8 పాయింట్లతో వరుస స్థానంల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌ దాదాపు టోర్నీ నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లే.

కానీ, పోతూ పోతూ ఇతర జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చడమో, నాశనం చేయడమో అయితే కచ్చితంగా చేయనుంది.  ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 11 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో చివరి ప్లేస్‌లో ఉంది. ఆర్సీబీ 11 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఆర్సీబీకి మిగిలిన మూడు  మ్యాచ్‌ల్లో గెలిచి.. ఇతర టీమ్స్‌ ఫలితాలు అనుకూలంగా వస్స్తే.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లొచ్చు. అయితే అది అంత సులువైన విషయం కాదు.. చాలా సమీకరణాలు కలిసి రావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. జట్ల ప్రదర్శనల ఆధారంగా చూస్తే.. రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ప్లే ఆఫ్స్‌ చేరే సూచనలు కనిపిస్తున్నా​యి. అలా అని మిగతా టీమ్స్‌ను తక్కువ అంచనా వేయలేం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.