iDreamPost

మెగా మూవీ వచ్చేది ఎప్పుడు

మెగా మూవీ వచ్చేది ఎప్పుడు

సంక్రాంతికి మూడు భారీ సినిమాల విడుదల ప్రకటించాక ఆ ఒత్తిడి ఇప్పుడు నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మీద పడింది. లాక్ డౌన్ కు ముందు వదిలిన లాహే లాహే లిరికల్ వీడియో తప్ప ఆ తర్వాత యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఏదో మొక్కుబడిగా రామ్ చరణ్ పూజా హెగ్డేల పోస్టర్ ఒకటి, సోనూ సూద్ బర్త్ డే ఫోటో ఒకటి వదిలారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. షూటింగ్ చివరి స్టేజిలో ఉన్నప్పటికీ టీమ్ మాత్రం సైలెంట్ గా ఉంది. చిరు సైతం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నా ఈ సినిమాకు సంబంధించి మాత్రం ఏమి చెప్పడం లేదు. ఇదంతా కేవలం రిలీజ్ విషయంలో ఏర్పడిన అయోమయం వల్లే.

నిజానికి నిన్న ఉదయం నుంచి ఆచార్య 2022 జనవరి 7న విడుదలవుతుందని గట్టి ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఇది నమ్మేసి వైరల్ చేశారు. సాయంత్రం అఫీషియల్ అవుతుందని అందులో పేర్కొన్నారు. కానీ అదంతా ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ఇంకా నాలుగు పాటల ఆడియో రిలీజ్ చేయాలి. ట్రైలర్ కట్ జరగలేదు. రామ్ చరణ్ పాత్ర తాలూకు ఇంట్రోని పరిచయం చేయలేదు. పూజా హెగ్డే కంప్లీట్ లుక్స్ ఎలా ఉంటాయో బయటికి రాలేదు. చాలా విషయాలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఒకవేళ నిజంగా జనవరినే అనుకున్నా కూడా అదేదో లాక్ చేసుకుంటే మిగిలిన వాళ్లకు క్లారిటీ వస్తుంది కదా

మరొక వెర్షన్ ప్రకారం ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక అక్టోబర్ 13న రాలేకపోతే ఆ స్లాట్ ని ఆచార్య తీసుకోవాలనే ఆలోచన కూడా సాగుతోంది. ఎలాగూ పుష్ప, కెజిఎఫ్ 2 డిసెంబర్ లో వస్తున్నాయి. నవంబర్ అంత అనుకూలమైన సీజన్ కాదు. వస్తే అక్టోబర్ లేదా జనవరి తప్ప ఆచార్యకు మరో ఆప్షన్ ఉన్నట్టు కనిపించడం లేదు. మరోవైపు ఇదే తరహా పరిస్థితిని బాలకృష్ణ అఖండ కూడా ఎదురుకుంటోంది. కరోనా థర్డ్ వేవ్ ప్రచారం కూడా ఇలాంటి భారీ చిత్రాలను అయోమయంలో నెట్టేస్తోంది. సైరా తర్వాత చిరంజీవి చేస్తున్న మూవీగా కంటే తండ్రి కొడుకుల ఫుల్ లెన్త్ కాంబో అనే కోణంలోనే ఆచార్య మీద అంచనాలు ఎక్కువయ్యాయి

Also Read :అక్కినేని బ్రహ్మచారి జాడ ఎక్కుడ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి