iDreamPost
android-app
ios-app

Jr. NTR: దేవర.. నీకు రూ.1000 కోట్లు అంటే ఇంత చీపా? ఏమి స్టామినా స్వామి?

  • Published Apr 18, 2024 | 2:02 PM Updated Updated Apr 18, 2024 | 2:02 PM

Jr NTR నటిస్తున్న దేవర మూవీ రూ. 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దాదాపు రూ. 600 కోట్లను రాబట్టినట్లు సమాచారం. దీంతో యంగ్ టైగర్ స్టామినా చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Jr NTR నటిస్తున్న దేవర మూవీ రూ. 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దాదాపు రూ. 600 కోట్లను రాబట్టినట్లు సమాచారం. దీంతో యంగ్ టైగర్ స్టామినా చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 18, 2024 | 2:02 PMUpdated Apr 18, 2024 | 2:02 PM
Jr. NTR: దేవర.. నీకు రూ.1000 కోట్లు అంటే ఇంత చీపా? ఏమి స్టామినా స్వామి?

అక్టోబర్ 10, 2024.. ఈ రోజు కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ లాంటి అద్భుతమైన హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ.. మళ్లీ 8 సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ తో జత కట్టాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం ‘దేవర’. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. అదేంటంటే? రూ. 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 1000 కోట్లు. ఇక ఇందులో ఇప్పటికే రూ. 600 కోట్లను రాబట్టినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

‘దేవర’.. టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న దేవర అక్టోబర్ 10న థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేవరపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఎన్టీఆర్ స్టామినాకి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కాబోతున్నట్లు తెలుస్తోంది. రూ. 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వెయ్యి కోట్లను టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగబోతోంది. కాగా ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కింద వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 130 కోట్లకు హక్కులను కోట్ చేసినట్లు సమాచారం. దీన్నీ బట్టే అర్దమవుతోంది యంగ్ టైగర్ దమ్మేందో. అదీకాక ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా మరో 200 కోట్లు గ్యారంటీగా వస్తాయి. అంటే ఈ లెక్కన చూసుకుంటే 1000 కోట్ల టార్గెట్ లో అప్పుడే రూ. 600 కోట్లను రాబట్టినట్లే దేవర. ఈ న్యూస్ కాస్త బయటకి రావడంతో.. ఎన్టీఆర్ స్టామినాకి అందరూ ఫిదా అవుతున్నారు.

యంగ్ టైగర్ లాంటి స్టార్ హీరోకి సరైన కథ పడితే.. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కావడం ఖాయం. అలాంటి సినిమానే దేవర అని డైరెక్టర్ కొరటాల శివ ముందు నుంచి చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇక టార్గెట్ విషయం తెలిసిన నెటిజన్లు.. దేవర నీకు వెయ్యి కోట్లు అంటే ఇంత చీపా? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వెయ్యి కోట్లు ఏం ఖర్మ సరైన హిట్ పడితే.. రూ. 1500 కోట్లైనా కొల్లగొట్టే దమ్మున్న హీరో మా తారకన్న అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. చూడాలి మరి అక్టోబర్ 10న ఏ రేంజ్ కలెక్షన్ల సునామీని ఈ దేవర సృష్టిస్తాడో. ఇక ఈ మూవీలో యంగ్ టైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరి తారక్ బాక్సాఫీస్ స్టామినాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş