• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » devotional » When Vinayaka Chavithi 2023 Holiday In Ts And Ap

వినాయక చవితి 2023 పండుగ సెలవు ఎప్పుడంటే..?

  • By Dharani Published Date - 10:25 AM, Sat - 16 September 23 IST
వినాయక చవితి 2023 పండుగ సెలవు ఎప్పుడంటే..?

ఈ ఏడాది పండుగల విషయంలో కొన్ని సందేహాలు పుట్టుకొస్తున్నాయి. తెలుగు క్యాలెండర్‌ ప్రకారం పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో కొన్ని తిథులు రెండు రోజుల మధ్య కొనసాగుతుండటంతో.. పండగలు చేసుకునే అంశంలో అనేక అనుమానాలు తెలత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రాఖీ పండుగ సందర్భంగా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఇక తాజాగా రానున్న వినాయక చవితి పండుగ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18, 19వ తేదీలలో వినాయక చవితి వచ్చింది. దీంతో కొందరు సెప్టెంబర్ 18 సోమవారం నాడు వినాయక చవితి జరుపుకోవాలని.. మరికొందరు సెప్టెంబర్‌ 19వ తేదీ మంగళవారం జరుపుకోవాలని చెబుతున్నారు. పండగ విషయంలో మరోసారి అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. పైగా స్కూళ్లు, కాలేజీలకు ఏ రోజు సెలవు ప్రకటించారు అనే దాని మీద కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

క్యాలెండర్‌ ప్రకారం చూసుకుంటే.. సెప్టెంబర్‌ 18,19 రెండు రోజులు వినాయక చవితి అని ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం.. 2023 పోర్టల్ క్యాలెండర్‌లో గణేష్ చతుర్థికి సెప్టెంబర్ 18 సెలవుగా ప్రకటించింది. ఈ సెలవును ‘సాధారణ సెలవులు’ కేటగిరీ కింద ప్రకటించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న జరిగే గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది. మరి రెండు రోజులు పండగ అంటున్నారు కాబట్టి.. ప్రభుత్వాలు సెలవు తేదీని మారుస్తాయేమో చూడాలి. దీని మీద అధికారిక ప్రటకన వెలువడిన తర్వాతే ఓ స్పష్టత వస్తుంది.

కాణిపాకం, తిరుమల పండితులతో పాటు ఇతర పూజారులు కూడా ఇప్పటికే పలు వేదికల మీదుగా.. వినాయక చవితి పండుగ తేదీపై స్పష్టత ఇచ్చారు. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 12:39 గంటల వరకు తదియ తిథి ఉంటుందని.. ఆ తర్వాత నుంచి చతుర్థి తిథి ప్రారంభమై.. మరుసటి రోజు అనగా సెప్టెంబర్‌ 19 రాత్రి 8:43 గంటలకు ముగియనుంది అని తెలిపారు. ఉదయం తిథి ప్రకారం అయితే.. గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 19వ తేదీనే జరుపుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లో ఎప్పుడంటే..

అయితే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం మాత్రం సెప్టెంబర్ 18వ తేదీనే వినాయక చవితి అని స్పష్టం చేసింది. అలాగే.. భాగ్యనగర కమిటీ కూడా సెప్టెంబర్‌ 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో.. హైదరాబాద్‌లో కూడా సెప్టెంబర్ 18నే వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు.

Tags  

  • Andhra Pradesh
  • Ganesh Chaturthi 2023
  • Holiday
  • Telangana
  • Vinayaka Chavithi 2023

Related News

చిక్కుల్లోకి చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో కదలికలు!

చిక్కుల్లోకి చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో కదలికలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు చుట్టూ వివిధ కేసులు వరుసలో ఉన్నాయి. ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూముల కుంభకోణం వంటి కేసులు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఇలా ఏపీలోని కేసులతోనే చంద్రబాబు ఇబ్బందులు […]

8 hours ago
తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!

తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!

10 hours ago
TTD కీలక నిర్ణయం.. భక్తులకు ఆ టోకెన్లు నిలిపివేత!

TTD కీలక నిర్ణయం.. భక్తులకు ఆ టోకెన్లు నిలిపివేత!

11 hours ago
లంచాలు తినేసి.. కంచాలు మోగిస్తున్నారు: మాజీ మంత్రి పేర్ని నాని

లంచాలు తినేసి.. కంచాలు మోగిస్తున్నారు: మాజీ మంత్రి పేర్ని నాని

12 hours ago
అంగన్ వాడీలకు ప్రభుత్వం శుభవార్త!

అంగన్ వాడీలకు ప్రభుత్వం శుభవార్త!

13 hours ago

తాజా వార్తలు

  • వీడియో: క్రికెట్ మ్యాచ్ లో గొడవ.. ఆరుగురికి గాయాలు!
    8 hours ago
  • iPhone 13: రూ.59,900 ఐఫోన్ 13.. కేవలం రూ.39,999కే!
    8 hours ago
  • లక్ అంటే మీనాక్షిదే.. మరో స్టార్ హీరోతో సినిమా!
    8 hours ago
  • షాకింగ్: ఆత్మహత్య చేసుకున్న మాజీ MLA కూతురు!
    9 hours ago
  • పాక్ టీమ్ పై రమీజ్ రాజా ఆగ్రహం.. చెత్త ప్రదర్శన అంటూ..!
    9 hours ago
  • అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అయాన్
    9 hours ago
  • విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన! ఏం చేశాడో తెలుసా?
    10 hours ago

సంఘటనలు వార్తలు

  • అనుపమకు చేదు అనుభవం.. రెండేళ్లు సినిమాలకు దూరం!
    10 hours ago
  • Bigg Boss 7 Telugu: లీక్ చేసిన నాగార్జున.. హౌస్ లోకి రాబోతోంది వీళ్లే!
    10 hours ago
  • వీడియో: అడ్డంగా బుక్కైన సందీప్.. వీడియో పెట్టి మరీ పరువు తీస్తున్నారు!
    11 hours ago
  • వీడియో: గుడిలో హుండీ డబ్బులు కొట్టేసిన పూజారి!
    11 hours ago
  • వీడియో: పొలాల్లో దిగిన ఆర్మీ హెలికాప్టర్
    12 hours ago
  • యాక్సిడెంట్‌లో మహిళ మృతి.. ప్రముఖ నటుడు అరెస్ట్
    12 hours ago
  • Bigg Boss 7 Telugu: శివాజీ డబుల్ గేమ్ కు పెద్ద గిఫ్ట్.. పరువు పోయిందిగా!
    13 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version