SNP
IND vs AFG, T20 World Cup 2024: సూపర్ 8 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయితే.. టీమిండియా పరిస్థితి ఏంటని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. మరి దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
IND vs AFG, T20 World Cup 2024: సూపర్ 8 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయితే.. టీమిండియా పరిస్థితి ఏంటని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. మరి దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా సూపర్ 8 మ్యాచ్‌లకు సిద్ధం అవుతోంది. గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి.. టేబుల్ టాపర్‌గా సూపర్ 8కు అర్హత సాధించిన భారత్.. సూపర్ 8లో అసలైన పరీక్షను ఎదుర్కొనుంది. సూపర్ 8లో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడనుంది రోహిత్ సేన. 20న ఆఫ్ఘనిస్థాన్‌తో, 22న బంగ్లాదేశ్‌తో, 24న ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మూడు మ్యాచ్‌లకు కూడా వర్షం గండం ఉండటంతో.. ఒక వేళ వర్షంతో మ్యాచ్‌లు రద్దు అయితే టీమిండియా పరిస్థితి ఏంటనే విషయంపై భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మరి నిజంగానే మూడుకు మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయితే.. టీమిండియాకు ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయి? సెమీస్‌కు వెళ్తుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే.. గ్రూప్ స్టేజ్‌లో కూడా కొన్ని పెద్ద టీమ్స్ వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడ్డాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టుకు ఏకంగా టోర్నీ నుంచి ఇంటికి వెళ్లే పరిస్థితులు వచ్చాయి. అందుకే వర్షం వల్ల టీమిండియాకు నష్టం జరుగుతుందేమో అని క్రికెట్ అభిమానుల కంగారు పడుతున్నారు. సూపర్ 8కు చేరిన 8 జట్లలో.. గ్రూప్-1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. వర్షం లేకుండా.. మ్యాచ్‌లు సవ్యంగా సాగితే.. ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుతాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
ఒక వేళ టీమిండియా ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు రద్దు అయితే.. రోహిత్ సేన ఖాతాలో మూడు పాయింట్లు మాత్రమే ఉంటాయి, రన్‌రేట్ 0 ఉంటుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా.. బంగ్లా, ఆఫ్ఘాన్‌పై గెలిస్తే 4 పాయింట్లతో సెమీస్‌కు చేరుతుంది. అప్పుడు ఆఫ్ఘాన్, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లు కూడా మూడు పాయింట్ల వస్తాయి. టీమిండియాకు 0 రన్ రేట్ ఉండటంతో, ఆఫ్ఘాన్ లేదా బంగ్లా సెమీస్‌కు వెళ్తుంది. ఒక వేళ మిగతా మ్యాచ్‌లు అన్ని కూడా రద్దు అయితే.. టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా, గతంలో రెండు జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎవరు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచారు అనే గణంకాల ఆధారంగా సెమీస్ బెర్త్ ఖారారు చేస్తారు. అన్ని మ్యాచ్‌లు రద్దు అవ్వడం అసాధ్యం కాబట్టి.. టీమిండియా మ్యాచ్ ఆడకుండా సెమీస్‌కు అయితే చేరలేదు. దురదృష్టవశాత్తు ఇండియా ఆడే మ్యాచ్‌లు మాత్రమే రద్దు అయితే.. మనకు అది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. పైగా సూపర్ 8 మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్‌డే కూడా కేటాయించలేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gearing 🆙 for the Super 8s 👌 👌
Prep Mode 🔛 for #TeamIndia 👍 👍#T20WorldCup pic.twitter.com/DjR38cuJZi
— BCCI (@BCCI) June 19, 2024