iDreamPost

ఈ వీకెండ్ లో ఏం చూడాలి: శాండ్‌మ్యాన్, లైట్‌ఇయర్, ది బాట్‌మాన్ ..ఇంకా

ఈ వీకెండ్ లో ఏం చూడాలి: శాండ్‌మ్యాన్, లైట్‌ఇయర్, ది బాట్‌మాన్ ..ఇంకా

ది శాండ్‌మ్యాన్( Sandman) నుండి లైట్‌ఇయర్( Lightyear) వరకు, ఈ వారాంతంలో మీరు నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) , డిస్నీ ప్లస్ హోస్టార్‌(Disney Plus Hostar)లో మీరు చూడ‌ద‌గిన‌ సినిమాలు, సీరీస్ లు ఇవి.

ది శాండ్‌మ్యాన్, నెట్‌ఫ్లిక్స్(The Sandman, Netflix)

దేశ‌వ్యాప్తంగా ఎదురుచూస్తున్న‌ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది శాండ్‌మ్యాన్ ఎట్టకేలకు వచ్చింది. ఈ 10 ఎపిసోడ్ ల సీరీస్ లో ఏళ్ల త‌ర‌బ‌డి తరబడి జైలులో ఉన్న త‌ర్వాత , త‌న నుంచి దొంగించిన వాటిని క‌నిపెట్ట‌డానికి, మార్ఫియస్ – ది కింగ్ ఆఫ్ డ్రీమ్స్ ప్రపంచాల మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు.

ద బాట్‌మాన్, అమెజాన్ ప్రైమ్ వీడియో (The Batman, Amazon Prime Video)
రాబర్ట్ ప్యాటిన్సన్ నటించిన ది బాట్‌మ్యాన్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అండర్ వరల్డ్ మాఫియాలు, ముఠాలతో దారి తప్పిన గోత‌మ్ లో సినిమా న‌డుస్తుంది. ఈ సినిమా మరో సూపర్ హీరో మూవీ కాదు. నేరాలను పరిష్కరించే హీరోది.

డార్లింగ్స్, నెట్‌ఫ్లిక్స్ Darlings, Netflix
అలియా భట్ నటించిన డార్లింగ్స్, బద్రు గురించి, ఆమె డ్రంక‌న్ హ‌స్బెండ్ గురించి. భర్త మద్యపానం మానేస్తే, మ‌నిషి మార‌తాడ‌ని అనుకొంది. కాని, అతని అరాచ‌కం మితిమీరిన‌ప్పుడు, ఆమె, ఆమె తల్లి ధైర్యంగా ప్రతీకారం తీర్చుకుంటారు.

లైట్‌ఇయర్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Lightyear, Disney Plus Hotstar)
లైట్‌ఇయర్ చివరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. లెజెండరీ స్పేస్ రేంజర్ బజ్ లైట్‌ఇయర్ ఇజ్జీ, మో, డార్బీ, అతని రోబోట్ సహచరుడు సాక్స్‌లతో కలిసి నక్షత్రమండలాల మద్య సాహసయాత్ర గురించిన సినిమా ఇది. తమిళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మరియు మలయాళంలో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ మొత్తం క‌ల‌సి చూడాల్సిన సినిమా.

Ms మార్వెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Ms Marvel, Disney Plus Hotstar)
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ Ms. మార్వెల్ అనే ముస్లిం అమెరికన్ టీనేజర్ కమలా ఖాన్ అనే కొత్త సూపర్ హీరోని పరిచయం చేసింది. ఆమె త‌న సూపర్ పవర్స్‌ను కనుక్కొనే వ‌ర‌కు, ఆమె ఎప్పుడూ స్కూల్, ఇంటిలో అదృశ్యంగానే ఉన్న‌ట్లు ఫీల‌వుతుంది. ఆమె షేప్ షిప్ట‌ర్ అంటే ఆమె చిన్న‌గా లేదంటే పెద్ద‌గా ఎద‌గ‌ల‌దు. టీనేజ‌ర్ల‌ను ఊపేస్తున్న సినిమా ఇది.

ద మోస్ట్ హేటెడ్ మేన్ ఆన్ ద ఇంట‌ర్నెట్, నెట్‌ఫ్లిక్స్ (The Most Hated Man on the Internet, Netflix)
రివెంజ్ పోర్న్ వెబ్‌సైట్ నుండి తన కూతురి ఫోటోలను తొల‌గించ‌డానికి గ‌ట్టి ప‌ట్టుప‌ట్టిన‌ మహిళ గురించిన‌దే ఈ నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ డాక్యుమెంటరీ. అస‌లు ఆ వెబ్ సైట్ ను మూసివేయించ‌డానికి ఆన్‌లైన్ క్రూసేడ్ మొద‌లుపెట్టింది.


ది గ్రే మ్యాన్, నెట్‌ఫ్లిక్స్ (The Gray Man, Netflix)

ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling) క్రిస్ ఎవాన్స్( Chris Evans )లు న‌టించిన‌ ది గ్రే మ్యాన్ ఆల్ ఔట్ యాక్షన్ మూవీ. ఇది CIA సీక్రెట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. అత‌ను ఎవ‌రో ఎవరో ఎవ‌రికీ తెలియ‌దు. అత‌ని చేతిలో అనుకోకుండా ఏజెన్సీ చీకటి ర‌హ‌స్యాలు చిక్కుతాయి. అత‌నిమీద ఒక సైకోపతిక్ సిఐఏ ఏజెంట్ అతని తలకి విలువ క‌డ‌తాడు. అంతే అత‌నికోసం గ్లోబల్ మాన్‌హాంట్ మొద‌లవుతుంది. ధ‌నుష్ కేర‌క్ట‌ర్ చాలా ఇంట్రెస్టింగ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి