iDreamPost

నెలసరి సెలవులు అంటే ఏంటి? ఎందుకు కేంద్రం ఇవ్వ‌డంలేదు?

నెలసరి సెలవులు అంటే ఏంటి? ఎందుకు కేంద్రం ఇవ్వ‌డంలేదు?

ప్రభుత్వ రంగ స్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. 1972 నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ లో పిరియడ్ లీవ్ ప్రస్తావన లేదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో వెల్లడించారు. ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అయితే ఒక మహిళా ప్రభుత్వోద్యోగికి సాధారణ సెలవులతో పాటు మెటర్నిటీ లీవ్, పిల్లల సంరక్షణ సెలవు, అసాధారణ పరిస్థితుల్లో తీసుకునే సెలవులు అందుబాటులో ఉన్నాయని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. అలాగే బాలికల్లో నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించే విధంగా 2011 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నోపథకాలను అమలు చేస్తోందని వివరించారు.

నెల‌స‌రి సెలవు అంటే ఏమిటి?

ఉద్యోగ మహిళలకు నెల‌స‌రి సెలవును అమలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా సానుకూల‌ చర్చ జరుగుతోంది. ఇది కూడా సెల‌వు. నెల‌స‌రి స‌మ‌యంలో మహిళలు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఋతుస్రావంస‌మ‌యంలో తీవ్రమైన అసౌకర్యం, నొప్పి, భావోద్వేగ సమస్యలు , ఇతర ఆరోగ్య సమస్యలొస్తుంటాయి. ఇలాంటి స‌మ‌యంలో మహిళలు ఆఫీసులో కాకుండా వారి ఇంటి ద‌గ్గ‌రే ఉంటే సౌకర్యంగా ఉంటారు. అందుకే నెల‌కు రెండురోజులు నెల‌స‌రి సెల‌వులు ఇవ్వాల‌న్న‌ది మ‌హిళ‌ల డిమాండ్.

ఎదుగుతున్న దేశాల్లో నెల‌స‌రి సెల‌వులు ఉండ‌వు. అదేదో నిషిద్ధ‌మైన అంశంలా ఎవ‌రూ మాట్లాడ‌రు. ఒక‌వేళ ఎవ‌రైనా నెల‌స‌రి సెల‌వులు అడిగినా ఆ మహిళల పని సామర్థ్యం గురించి త‌క్కువ‌గా మాట్లాడేస్తారు. పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌లకు సెల‌వులు ఎక్క‌వంటూ సెక్సిజాన్ని కూడా ప్ర‌ద‌ర్శిస్తారు.

ఈ రోజు బాగాలేదు, నీరసంగా ఉంది లాంటి కారణాలు చూపించి నెలకోసారైనా మ‌హిళ‌లు సెలవు పెడుతుంటారు. కాని అసలు కారణం ‘నెలసరి’ గురించి చెప్ప‌రు. సిగ్గుప‌డుతుంటారు. కాని, ‘స్విగ్గీ’ మ‌హిళా ఉద్యోగుల కోసం నెలకి రెండురోజుల నెలసరి సెలవుల్ని ఇస్తోంది. స్విగ్గీ డెలివరీలు తీసుకోవడానికి వెళ్లే రెస్టారెంట్ల దగ్గర శుభ్రమైన వాష్‌రూమ్‌లు ఉండేటట్టు జొమాటోతో కలిసి ఏర్పాట్లూ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి