iDreamPost

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్! పిల్లలు ఉన్నవారికి అదృష్టం!

కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు/పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పెన్షన్ కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా భర్త నుండి దూరంగా ఉంటున్న, ఉండాలనుకుంటున్న మహిళలకు ఈ నయా నిబంధన వరంగా మారే అవకాశాలున్నాయి..

కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు/పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పెన్షన్ కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా భర్త నుండి దూరంగా ఉంటున్న, ఉండాలనుకుంటున్న మహిళలకు ఈ నయా నిబంధన వరంగా మారే అవకాశాలున్నాయి..

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్! పిల్లలు ఉన్నవారికి అదృష్టం!

మహిళలు మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులా.. అయితే ఈ శుభవార్త మీ కోసమే. మహిళా ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి.. మోడీ నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పిల్లల భద్రత, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న మహిళా ఉద్యోగుల విషయంలో కొత్త రూల్స్ తీసుకువచ్చింది. విడాకులు, గృహ హింస, వరకట్నం కేసులేమైనా కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లయితే.. తన పెన్షన్.. భర్తకు బదులుగా తమ పిల్లలను నామినేట్ చేసుకునే సదావకాశాన్ని అందిస్తోంది. ఉద్యోగులతో పాటు మహిళా పెన్షనర్లకూ ఈ రూల్ వర్తిస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ప్రకటన చేసింది.

కొత్త రూల్స్ ప్రకారం.. మహిళా ప్రభుత్వ ఉద్యోగి కానీ.. పెన్షనర్ కానీ.. తాను మరణిస్తే.. ఆ తర్వాత వచ్చే పెన్షన్ తన భర్తకు బదులుగా.. పిల్లలకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక వేళ పిల్లలు మైనర్లయినా, వైకల్యంతో బాధపడుతున్నా ఆ పెన్షన్ సంరక్షకుడికి చెందుతుంది. యుక్త వయసుకు వచ్చిన తర్వాత నేరుగా ఆ మొత్తాన్ని తీసుకునేందుకు వారి పిల్లలు అర్హులు అవుతారు. ఈ కొత్త రూల్ భర్తతో విడిపోయేందుకు ప్రయత్నిస్తున్న, దూరంగా ఉంటున్న మహిళలకు అదృష్టంగా, ఆశాజనకంగా మారొచ్చు.

ప్రస్తుతం పెన్షన్ నిబంధన ఎలా ఉందంటే..

సెంట్రల్ సివిల్ సర్వీసెస్(CCS (పెన్షన్)) రూల్స్, 2021లోని రూల్ 50లోని సబ్-రూల్ (8), సబ్-రూల్ (9) ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ మరణిస్తే.. తన పెన్షన్ తొలి కుటుంబ ప్రాధాన్యతగా జీవిత భాగస్వామికి (కలిసి ఉన్నా.. విడిపోయినా కూడా) దక్కేది. మరణించిన ప్రభుత్వోద్యోగి/పెన్షనర్ జీవిత భాగస్వామి కుటుంబ పెన్షన్‌కు అర్హులు కానప్పుడు లేదా మరణించిన తర్వాత మాత్రమే పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కుటుంబ పెన్షన్‌కు అర్హులవుతారు. అయితే ఈ నిబంధనలను సవరించింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మహిళల కోసం నిబంధనల్లో మార్పులు చేసింది.

కొత్త పెన్షన్ నిబంధన ఏంటంటే..

మహిళా ప్రభుత్వ ఉద్యోగి/ఫించను దారు.. తన విడాకుల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నా, తన భర్తపై భారతీయ శిక్షాస్మృతి, గృహ హింస, వరకట్న నిషేద చట్టం కింద కేసులు నమోదు చేసినట్లయితే.. తాను మరణిస్తే.. ఆ తర్వాత పెన్షన్.. భర్తకు కాకుండా పిల్లలకు మంజూరు చేసుకునేందుకు అభ్యర్థించవచ్చునని కొత్త రూల్స్ చెబుతున్నాయి. ఈ కొత్త నిబంధనల కింద తన పిల్లలను పెన్షన్ కోసం నామినేట్ చేసుకోవచ్చు. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే.. పిల్లలు యుక్త వయస్సుకు వచ్చి ఉంటే, వారు జీవించి ఉంటే.. వారికే నేరుగా పెన్షన్ అందిస్తారు. ఒక వేళ పిల్లలు యుక్త వయస్సు రాకపోయినా.. అర్హులు కాకపోయినా.. నిబంధనల మేరకు జీవిత భాగస్వామికి అందిస్తారు. మహిళా ఉద్యోగి మరణానంతరం ఆమె పిల్లలు మైనర్లయితే సంరక్షకుడికి కుటుంబ పెన్షన్ అందుతుంది. మేజర్లు అయ్యాక వారికి నేరుగా పెన్షన్ అందుతుంది. మరీ ఈ నిబంధనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి