iDreamPost

రష్మికని టార్గెట్ చేసిన.. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ అంటే ఏంటి?

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని గత కొన్ని దశాబ్ధాలుగా హాలీవుడ్‌ ఉపయోగిస్తూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని వందల సినిమాలు తెరకెక్కుతూ ఉన్నాయి...

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని గత కొన్ని దశాబ్ధాలుగా హాలీవుడ్‌ ఉపయోగిస్తూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని వందల సినిమాలు తెరకెక్కుతూ ఉన్నాయి...

రష్మికని టార్గెట్ చేసిన.. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ అంటే ఏంటి?

టెక్నాలజీ ఏదైనా కావచ్చు.. దాన్ని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి.. మంచి, చెడులు మారుతూ ఉంటాయి. కొంతమంది టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్‌ టెక్నాలజీతో ఆడవాళ్లే టార్గెట్‌గా దారుణాలకు తెగిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల కారణంగా  ప్రజలను భయపెట్టే టెక్నాలజీల్లో ‘‘డీప్‌ ఫేక్‌’’ టెక్నాలజీ కూడా ఒకటిగా మారి పోయింది. కొంతమంది డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి ఆడవాళ్ల ముఖాలను మార్చి సొమ్ముచేసుకుంటారు.

అన్యం పుణ్యం ఎరుగని ఆడవాళ్లను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీస్‌ డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ కారణంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇందుకు ప్రముఖ భారత నటి రష్మిక మందన్న ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. కొంతమంది దుండగులు డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి రష్మికకు సంబంధించిన ఓ అభ్యంతరకర వీడియోను తయారు చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. ఆ వీడియో రష్మిక దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆమె తీవ్ర మనోవేధనకు గురైంది.

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ కారణంగా కేవలం రష్మికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎంతో మంది ఆడవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని ద్వారా సెలెబ్రిటీలు, అందమైన అమ్మాయిల ముఖాలను పోర్న్‌ స్టార్స్‌ శరీరాలకు అతికించి వీడియోలు తయారు చేస్తున్నారు. ఆ వీడియోలు సదరు సెలెబ్రిటీలు, అమ్మాయిల క్లోజ్‌ సర్కిల్‌లోకి వెళుతున్నాయి. తద్వారా చేయని తప్పుకు ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇంతలా మహిళల్ని ఇబ్బంది పెడుతున్న డీప్‌ ఫేక్‌ అంటే ఏంటి?..

డీప్‌ ఫేక్‌ అంటే ఏమిటి? 

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీనే సింథటిక్‌ మీడియా అని కూడా ఉంటారు. ఇదో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ. డీప్‌ లెర్నింగ్‌ పద్దతిని ఉపయోగించి నకిలీ సంఘటనలను క్రియేట్‌ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డిజిటల్‌ మ్యానుపులేషన్‌( అంకాత్మక తారుమారు) పద్దతి ద్వారా ఒకరిలా ఉండే మరొకరిని సృష్టించొచ్చు. డీప్‌ జెనరేటివ్‌ మెథడ్స్‌ ద్వారా ముఖాలను మార్చవచ్చు. 2017లో మొదటి సారి డీప్‌ ఫేక్స్‌ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెడ్డిట్‌ ఖాతాదారుడు తన ఖాతాలో.. డీప్‌ ఫేక్‌ను ఉపయోగించి తయారు చేసిన కొన్ని అశ్లీల వీడియోలు షేర్‌ చేశాడు. అప్పుడే వాటి గురించి ప్రపంచానికి తెలిసింది.

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తారు?

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ కారణంగా విద్య, సినిమా, ఇతర రంగాలకు చెందిన వారు చాలా రకాల ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. విద్యారంగంలో పాఠాలు చెప్పడానికి ఉపయోగపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు స్కూళ్లలోని టీచర్లు.. మీడియా, ఆడియో, వీడియోలను ఉపయోగించి క్లాస్‌ రూములో పాఠాలు చెబుతున్నారు. సృజనాత్మకంగా పాఠాలు చెప్పడానికి డీప్‌ ఫేక్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఇక, సినిమా రంగంలో అయితే, డీప్‌ ఫేక్‌ ఉపయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని దశాబ్దాలుగా హాలీవుడ్‌ డీప్‌ ఫేక్‌ను వాడుతోంది. హై ఎండ్‌ CGI, VFX, SFX టెక్నాలజీలు ఉపయోగించి సినిమాలు తీస్తోంది. CGI, VFX, SFXలను ఉపయోగించే డీప్‌ ఫేక్‌ వీడియోలను తయారు చేస్తారు. అంతేకాదు! మానవ హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లు, కొంతమంది జర్నలిస్టులు తమ ఉనికిని బయటపెట్టకుండా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంటారు.

డీప్‌ ఫేక్‌ వీడియోలు, ఫొటోలను గుర్తించటం ఎలా?

డీప్‌ ఫేక్‌ వీడియోలకు, సాధారణ వీడియోలకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన మనిషి ముఖానికి సంబంధించిన వీడియోల్లో సహజత్వం అస్సలు ఉండదు. వీడియోలు, ఫొటోల్లోని మనిషి కళ్ల చుట్టూ ఓ తేలికపాటి షాడో ఉంటుంది. ముఖ కవలికల్లో కూడా తేడా ఉంటుంది. సరిగ్గా గమనిస్తే.. ముఖం, బాడీతో ఏ మాత్రం మ్యాచ్‌ కాకుండా ఉంటుంది. అతికించిన దాని లాగా కనిపిస్తూ ఉంటుంది. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి వీడియోలను తయారు చేయటం చాలా రిస్క్‌, టైంతో కూడుకున్న పని కాబట్టి.. వీడియోలు తక్కువ నిడివి కలిగి ఉంటాయి. వీడియో శబ్ధం కూడా సాధారణంగా ఉండదు. మరి, డీప్‌ ఫేక్‌ టెక్నాలజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి