iDreamPost

Shamar Joseph: బాడీగార్డ్ నుంచి క్రికెటర్‌గా.. తొలి మ్యాచ్‌లోనే స్మిత్‌కు చుక్కలు!

  • Published Jan 17, 2024 | 9:13 PMUpdated Jan 17, 2024 | 9:20 PM

క్రికెట్​లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలిసిందే. ఏళ్ల పాటు ఆడే ప్లేయర్లకు కూడా నేషనల్ టీమ్​లో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఓ బాడీగార్డ్​ను ఆ ఛాన్స్ వరించింది.

క్రికెట్​లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలిసిందే. ఏళ్ల పాటు ఆడే ప్లేయర్లకు కూడా నేషనల్ టీమ్​లో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఓ బాడీగార్డ్​ను ఆ ఛాన్స్ వరించింది.

  • Published Jan 17, 2024 | 9:13 PMUpdated Jan 17, 2024 | 9:20 PM
Shamar Joseph: బాడీగార్డ్ నుంచి క్రికెటర్‌గా.. తొలి మ్యాచ్‌లోనే స్మిత్‌కు చుక్కలు!

క్రికెట్​లో ఎంత హై కాంపిటీషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ టీమ్​లోకి రావడం అంత ఈజీ కాదు. ఏళ్లకు ఏళ్లు లీగ్స్, డొమెస్టిక్ క్రికెట్​లో ఆడుతూ జాతీయ జట్టులోకి రావాలని చాలా మంది క్రికెటర్లు ప్రయత్నిస్తుంటారు. అయినా ఏ కొందరికో మాత్రమే ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి సువర్ణావకాశం ఓ బాడీగార్డ్​కు దక్కింది. వెస్టిండీస్​ క్రికెట్​లోకి ఓ కొత్త కుర్రాడు దూసుకొచ్చాడు. అతడే షమర్ జోసెఫ్. ఒకప్పుడు బాడీగార్డ్​గా పనిచేసిన షమర్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్​లో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ యంగ్ పేసర్.. తొలి మ్యాచ్​లోనే స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లాంటి స్టార్ బ్యాటర్స్​ను పెవిలియన్​కు పంపించాడు. వేసిన తొలి బాల్​కే స్మిత్​ను ఔట్ చేసి క్రికెట్​లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

తొలి మ్యాచ్​లోనే స్టీవ్ స్మిత్​కు చుక్కలు చూపించిన షమర్ జోసెఫ్ ఈ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. అతడి జీవితం పూల పాన్పేమీ కాదు. గయానాలోని బారాకారా అనే గ్రామంలో పుట్టిన జోసెఫ్​కు ఐదుగురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. అతడి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా లేదు. కాంజే అనే నదిలో రెండ్రోజుల పాటు బోటులో ప్రయాణిస్తే గానీ అక్కడికి చేరుకోలేం. ఆ గ్రామంలో టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు. అయితే మారుమూల ఊళ్లో ఉంటున్నా క్రికెట్​ మీద ఉన్న ప్రేమే అతడ్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. తన గ్రామంలో ఉన్నప్పుడు టేప్ బాల్​తో క్రికెట్ ఆడేవాడతను. వెస్టిండీస్ బౌలింగ్ లెజెండ్స్ కర్ట్​లీ ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్​ను స్ఫూర్తిగా తీసుకొని బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు జోసెఫ్​. ఆ తర్వాత తన భార్య, రెండేళ్ల కొడుకును తీసుకొని వేరే చోటుకు మారాడు.

కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు షమర్ జోసెఫ్​. చివరికి బాడీగార్డ్​గా ఉద్యోగం దొరకడంతో దాని ద్వారా వచ్చే సంపాదనతో ఫ్యామిలీని నెట్టుకొచ్చాడు. అయితే ఆట​ కోసం బాడీగార్డ్​గా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు జోసెఫ్. జెంటిల్మన్ గేమ్​ను ఫుల్ టైమ్ కెరీర్​గా ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెటే శ్వాస, ధ్యాసగా ప్రాక్టీస్​లో మునిగిపోయాడు. అతడి కష్టం వృథా పోలేదు. కొన్నాళ్లకు గయానా హార్పీ ఈగల్స్ టీమ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో ఆడే అవకాశం దక్కింది. గత ఫిబ్రవరిలో డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. తనకు వచ్చిన ఛాన్స్​ను పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. ఆడింది మూడు మ్యాచులే అయినా 9 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో సౌతాఫ్రికా టూర్​కు వెళ్లిన వెస్టిండీస్-ఏ టీమ్​లో అతడికి ప్లేస్ దక్కింది.

సఫారీ గడ్డపై జరిగిన సిరీస్​లో విండీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు షమర్ జోసెఫ్​. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో గయానా అమేజాన్ వారియర్స్ తరఫున బరిలోకి దిగి రాణించాడు. ఇలా బౌలింగ్​లో దుమ్మురేపుతున్న జోసెఫ్​ను ఆసీస్​తో సిరీస్​కు ఎంపిక చేశారు సెలక్టర్లు. వాళ్ల నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఆడిన మొదటి మ్యాచ్​లో స్మిత్​తో పాటు లబుషేన్​ను పెవిలియన్​కు పంపాడు. దీంతో ఇలాంటి యంగ్​స్టర్స్ అవసరం విండీస్ క్రికెట్​కు ఎంతో ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటి వాళ్లు మరింత మంది వస్తేనే ఆ టీమ్​కు పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు. మరి.. విండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్ కథ విన్నాక మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Jofra Archer: IPL ఆడతానంటే వద్దన్నాం! మా టార్గెట్‌ అదే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి