iDreamPost

రెండోసారి తండ్రైన స్టార్ క్రికెటర్! వరల్డ్ కప్ నుంచి అర్దాంతరంగా ఇంటికి..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ నుంచి అర్దాంతరంగా ఇంటికి బయలుదేరాడు ఓ స్టార్ క్రికెటర్. దానికి కారణం అతడు రెండోసారి తండ్రి కావడమే. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ నుంచి అర్దాంతరంగా ఇంటికి బయలుదేరాడు ఓ స్టార్ క్రికెటర్. దానికి కారణం అతడు రెండోసారి తండ్రి కావడమే. ఆ వివరాల్లోకి వెళితే..

రెండోసారి తండ్రైన స్టార్ క్రికెటర్! వరల్డ్ కప్ నుంచి అర్దాంతరంగా ఇంటికి..

టీ20 వరల్డ్ కప్ లో ఆ జట్టు అద్భుతంగా ఆడుతోంది. వరుస మ్యాచ్ ల్లో గెలిచి.. సూపర్ 8 కి కూడా అర్హత సాధించింది. ఈ క్రమంలోనే ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. దాంతో క్రికెట్ బోర్డ్ నుంచి పర్మిషన్ తీసుకుని అర్ధాంతరంగా వరల్డ్ కప్ నుంచి ఇంటికి బయలుదేరాడు. తన బిడ్డను చూసుకుని మురిసిపోయాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ రోమారియో షెఫర్డ్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య టియా టెరెన్సియా షెఫర్డ్ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అతడికి రోమైర్ షెఫర్డ్ అని పేరు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఈ స్టార్ ప్లేయర్ బోర్డ్ నుంచి పర్మిషన్ తీసుకుని గయానా బయలు దేరాడు. దాంతో ఆఫ్గానిస్తాన్ తో మ్యాచ్ కు దూరమైయ్యాడు. తన కొడుకుని చూసుకుని మురిసిపోతున్నాడు షెఫర్డ్. ఇక ఈ దంపతులకు ఇంతకు ముందే ఓ కొడుకు ఉన్నాడు.

ఇక ఆఫ్గాన్ తో జరిగే మ్యాచ్ కి షెఫర్డ్ ప్లేస్ లో ఒబెడ్ మెకాయ్ ను జట్టులోకి తీసుకున్నారు. తిరిగి మంగళవారం జట్టుతో కలవనున్నాడు షెఫర్డ్. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో తన మెరుపు బ్యాటింగ్ తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ఐపీఎల్ లో సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక గత కొంతకాలంగా విండీస్ టీమ్ లో కీలక ప్లేయర్ గా కొనసాగుతూ.. జట్టులో స్థిరమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 31 వన్డేల్లో, 39 టీ20ల్లో వెస్టిండీస్ కు ప్రాతినిథ్యం వహించాడు. 10 ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఆడాడు. ఇక రెండోసారి తండ్రైన ఈ విండీస్ ప్లేయర్ కు సహచరులు విషెస్ తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Romario Shepherd (@romarioshepherd)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి