iDreamPost

OTT లవర్స్‌కు వీకెండ్‌ ట్రీట్‌.. ఒక్కరోజే 10 సినిమాలు.. ఆ 3 స్పెషల్‌

  • Published Feb 08, 2024 | 7:50 AMUpdated Feb 08, 2024 | 7:50 AM

Weekend OTT Movies: మరో వీకెండ్‌ వచ్చేస్తోంది.. ఓటీటీల్లోకి కొత్త సినిమాలు రావడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ వీకెండ్‌లో విడుదల కాబోతున్న సినిమాలు ఏవి అంటే..

Weekend OTT Movies: మరో వీకెండ్‌ వచ్చేస్తోంది.. ఓటీటీల్లోకి కొత్త సినిమాలు రావడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ వీకెండ్‌లో విడుదల కాబోతున్న సినిమాలు ఏవి అంటే..

  • Published Feb 08, 2024 | 7:50 AMUpdated Feb 08, 2024 | 7:50 AM
OTT లవర్స్‌కు వీకెండ్‌ ట్రీట్‌.. ఒక్కరోజే 10 సినిమాలు.. ఆ 3 స్పెషల్‌

ఒకప్పుడు శుక్రవారం వస్తుంది అంటే.. ఏ కొత్త సినిమా విడుదల కాబోతుంది.. ఏ హీరో మూవీ థియేటర్‌లోకి రాబోతుంది అంటూ ఎదురు చూసే వారు మూవీ లవర్స్‌. అయితే ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు జనాలు ఓటీటీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి వీకెండ్‌ ఓటీటీలోకి ఏ సినిమాలు వస్తున్నాయి అని ఎదురు చూసే మూవీ లవర్స్‌ సంఖ్య పెరుగుతోంది. అదుగో అలాంటి వారికి ఇది పండగలాంటి వార్త. ఈ వీకెండ్‌లో ఏకంగా పది సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. పైగా ఈ వారంలో అన్ని పెద్ద సినిమాలే ఓటీటీలో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు తాజాగా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైపోయాయి.

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన పెద్ద సినిమాల్లో కొన్ని ఓటీటీల్లోకి వచ్చేశాయి. పొంగల్‌ సందర్భంగా విడుదలైన సినిమాల్లో సైంధవ్‌ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ ఈ వీకెండ్‌లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరీ వీటిల్లో ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలియాలంటే.. దీని మీద ఇక్కడ ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్:

  • వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి08
  • గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09
  • భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09
  • లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09
  • యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
  • ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09
  • ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
  • హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10
  • బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11

అమెజాన్ ప్రైమ్

  • కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09

డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌

  • ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09

జీ5

  • కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09

జియో సినిమా

  • హలో (వెబ్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 8

సన్‌ నెక్ట్స్‌

  • అయలాన్- (తెలుగు డబ్బింగ్ )- ఫిబ్రవరి 09

ఈ వీకెండ్‌లో 10 సినిమాలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. అలానే ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. వీటిల్లో మాస్ మహారాజా రవితేజ ఈగల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ అప్పుడు పోస్ట్‌పోన్‌ చేసుకుని.. ఈనెల 9, శుక్రవారం థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 సినిమా నేడు థియేటర్లలో విడుదల అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి