iDreamPost

ఆ ఊరిలో దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోన్న నీరు! శాస్త్రవేత్తలకి కూడా అర్ధం కావడం లేదు!

  • Published Apr 15, 2024 | 1:13 PMUpdated Apr 15, 2024 | 1:13 PM

ప్రపంచంలో ఎక్కడైనా సరే.. నీటి ప్రవాహం అనేది ఎగువ నుంచి దిగువకు మాత్రమే జరుగుతుంది. కానీ, ఒక ప్రదేశంలో మాత్రం నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తుందట. ఆ ప్రదేశం ఏంటో చూసేద్దాం.

ప్రపంచంలో ఎక్కడైనా సరే.. నీటి ప్రవాహం అనేది ఎగువ నుంచి దిగువకు మాత్రమే జరుగుతుంది. కానీ, ఒక ప్రదేశంలో మాత్రం నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తుందట. ఆ ప్రదేశం ఏంటో చూసేద్దాం.

  • Published Apr 15, 2024 | 1:13 PMUpdated Apr 15, 2024 | 1:13 PM
ఆ ఊరిలో దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోన్న నీరు! శాస్త్రవేత్తలకి కూడా అర్ధం కావడం లేదు!

ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు విశేషాలు అప్పుడప్పుడు ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. చెట్టు నుండి నీరు రావడం.. జంతువులకు మనుషులు జన్మించడం.. మనుషులు జంతువుల పోలికలతో పుట్టడం . ఇలా ఒకటి రెండు కాదు.. ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి అద్భుతాలు.. ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇవి కాస్త ఇప్పుడు అందరికి ఈజీగా తెలిసిపోతూ.. వైరల్ అవుతున్నాయి. నెట్టింట ఈ అద్భుతాలను చూసిన వారు లైక్స్, షేర్స్, కామెంట్స్ తో వాటిని మరింత ఫేమస్ చేసేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎక్కడ ఎవరు కనీ విని ఎరుగని ఒక వింత ఘటన సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది. అదే నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహించడం. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో తెగ షికార్లు చేస్తున్నాయి.

నీరు ఎపుడైనా కానీ.. ఎత్తైన ప్రాంతం నుంచి లోతైన ప్రాంతానికి ప్రవహిస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. దాని వెనుక సైన్స్ కు సంబంధించిన ఎన్నో కారణాలు ఉన్నాయి. నది నీరు దాని ద్రవత్వ లక్షణం కారణంగా ఎక్కువ ఎత్తుల నుండి తక్కువ ఎత్తులకు ప్రవహిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది అదే. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఒక్క ప్రాంతంలో మాత్రం.. ఇప్పుడు చెప్పుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తుంది. ఇది కేవలం సినిమాలలో వీఎఫ్ఎక్స్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అనుకున్నా.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజమే. ఈ అద్భుత ఘటన ఛత్తీస్ ఘడ్ లోని అంబికాపూర్ జిల్లా మెయిన్ పట్ సమీపంలో జరుగుతున్నది. ఆ ప్రాంతంలోని ఒక ప్రదేశంలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఆ ప్రాంతంలోని.. ఒక బండరాయి కింద నుంచి వస్తున్న ఊట కాలువ ద్వారా ఈ నీరు వృద్ధి చెంది.. సుమారు 2 కిలోమీటర్ల వరకు ఎత్తైన ఒక ప్రాంతానికి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి ఆ దగ్గరలోని ఒక జలపాతంలో కలుస్తుంది. శాస్త్రవేత్తలకు సైతం ఇది ఎలా సాధ్యపడుతుందనేది అర్ధం కానీ విషయంగా మారిపోయింది. ఈ విచిత్రాన్ని దృశ్యాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఆ ప్రాంతంలోని భూమిలో ఉండే గ్రావిటీ కారణంగా ఇలా జరుగుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో మాత్రం ఎవరికీ తెలియదు. ఛత్తీస్ గడ్ వాసులు ఆ ప్రదేశాన్ని మినీ కశ్మీర్ అని పిలుస్తూ ఉంటారు. మరి, ఈ విచిత్రమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి