iDreamPost

World Cup 2023: రోజుకి 8 కిలోల మటన్‌ తింటున్న పాక్‌ ఆటగాళ్లు! వసీం అక్రమ్‌ ఫైర్‌

  • Published Oct 24, 2023 | 1:22 PMUpdated Oct 24, 2023 | 1:22 PM

పాకిస్థాన్‌ చెత్త ప్రదర్శనతో వారిపై విమర్శల వర్షం కురిస్తోంది. క్రికెట్‌ ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు సైతం పాక్‌ క్రికెటర్లును ఏకీపారేస్తున్నారు. సోమవారం ఆఫ్ఘాన్‌పై ఓటమితో ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే.. తాజాగా ఒక్కో పాక్‌ ఆటగాడు రోజుకు 8 కిలోల మటన్‌ తింటున్నారంటూ..

పాకిస్థాన్‌ చెత్త ప్రదర్శనతో వారిపై విమర్శల వర్షం కురిస్తోంది. క్రికెట్‌ ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు సైతం పాక్‌ క్రికెటర్లును ఏకీపారేస్తున్నారు. సోమవారం ఆఫ్ఘాన్‌పై ఓటమితో ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే.. తాజాగా ఒక్కో పాక్‌ ఆటగాడు రోజుకు 8 కిలోల మటన్‌ తింటున్నారంటూ..

  • Published Oct 24, 2023 | 1:22 PMUpdated Oct 24, 2023 | 1:22 PM
World Cup 2023: రోజుకి 8 కిలోల మటన్‌ తింటున్న పాక్‌ ఆటగాళ్లు! వసీం అక్రమ్‌ ఫైర్‌

ఈ వరల్డ్‌ కప్‌లో పాపం పాకిస్థాన్‌ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఆరంభంలో నెదర్లాండ్స్‌, శ్రీలంకపై నెగ్గిన పాక్‌.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇండియా, ఆస్ట్రేలియా అంటే పెద్ద టీమ్స్‌, వీళ్ల చేతుల్లో ఓటమిని ఒప్పుకోవచ్చు.. కానీ, చివరి ఆఫ్ఘనిస్థాన్‌ చేతుల్లో కూడా ఓటమి పాలైంది పాకిస్థాన్‌. అది కూడా ఎంతో దారుణాతి దారుణంగా. అసలు ఆఫ్ఘనిస్థాన్‌ ఏం మాత్రం పసికూన జట్టులా ఆడలేదు. నిజానికి పాకిస్థాన్‌ జట్టునే ఓ పసికూనలా మార్చేసింది తమ ఆటతీరుతో. సోమవారం చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 283 పరుగుల భారీ టార్గెట్‌ను ఆఫ్ఘాన్‌ టీమ్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం విశేషం.

అయితే.. ఆఫ్ఘాన్‌ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్‌ టీమ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాతో ఈ నెల 14న జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్‌ టీమ్‌ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. ఆ టీమ్‌లో అసలు గెలవాలనే కసే కనిపించడం లేదు. ఏదో ఆడాం అంటే ఆడాంలా ఉంది పరిస్థితి. టీమిండియా చేతిలో ఓటమితోనే పాక్‌ టీమ్‌ను ఆ దేశ క్రికెట్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఏకీ పారేస్తున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓడినా.. గట్టి పోటీ ఇచ్చిందిలే అని సరిపెట్టుకున్నారు. కానీ, ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌తో పాటు పాకిస్థాన్‌ టీమ్‌ మొత్తాన్ని సోషల్‌ మీడియా వేదికగా పిచ్చి తిట్లు తిడుతున్నారు పాకిస్థాన్‌ అభిమానులు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై ఓటమి తర్వాత.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో మ్యాచ్‌ అనాలసిస్‌లో పాల్గొన్న వసీం.. పాకిస్థాన్‌ టీమ్‌ను ఏకిపారేశారు. అసలు టీమ్‌ ఫీల్డింగ్‌ అయితే చెత్తగా ఉందని, ఒక్కో ఆటగాడి పేరు పేరున చెబితే తెల్లముఖాలు వేసుకుంటారని మండిపడ్డారు. అసలు పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఫిట్‌గా లేరని, వారికి ఫిట్‌నెస్‌ టెస్ట్‌ పెట్టి మూడు వారాలు దాటిపోయిందని అన్నారు. ఒక్కొక్కరు రోజుకి 8 కిలోల మటన్‌ తింటున్నట్లు ఉన్నారని సెటైర్లు వేశారు. కాగా, పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ మాత్రం నిజంగా ఓ అంతర్జాతీయ టీమ్‌ స్థాయిలో లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఏ టీమ్‌ అయినా బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా ఉంటేనే విజయాలు దక్కుతాయని విషయం తెలుసుకోవాలి. అయితే.. పాకిస్థాన్‌ టీమ్‌పై వసీం అక్రమ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ విషయంలో రోహిత్-కోహ్లీ మధ్య వాదన! ఏకంగా గ్రౌండ్​లోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి