iDreamPost
android-app
ios-app

కోహ్లీ, రోహిత్ కాదు.. వరల్డ్ కప్ లో టీమిండియా ప్రధాన ఆయుధం అతడే: పాక్ దిగ్గజం

  • Author Soma Sekhar Published - 08:22 AM, Tue - 19 September 23
  • Author Soma Sekhar Published - 08:22 AM, Tue - 19 September 23
కోహ్లీ, రోహిత్ కాదు.. వరల్డ్ కప్ లో టీమిండియా ప్రధాన ఆయుధం అతడే: పాక్ దిగ్గజం

మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్ కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే చాలా జట్లు ప్రపంచ కప్ లో పాల్గొనబోయే సభ్యుల పేర్లను కూడా ప్రకటించాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే ఓ టీమిండియా ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్. ఈ వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా ప్రధాన ఆయుధం అతడే.. విరాట్ కోహ్లీ, రోహిత్ కాదు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ పై పాక్ దిగ్గజం, ఫాస్ట్ బౌలర్ వసీమ్ అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ అని చెబుతూనే.. భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే అంటూ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో పాండ్యా ఇటు బంతితో, అటు బ్యాట్ తో రాణించి జట్టు విజయాల్లో తనవంతు పాత్రను నిర్వహించాడు. పాక్ తో జరిగిన(రద్దైన) మ్యాచ్ లో టాపార్డర్ విఫలం అయిన వేళ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో 90 బంతుల్లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక లంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.

ఈ నేపథ్యంలోనే వచ్చే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రధాన ఆయుధం పాండ్యానే అంటూ కితాబిచ్చాడు వసీమ్ అక్రమ్. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా బౌలింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని, ఈ టోర్నీలో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, అతడు పెద్ద జట్లపైనా వికెట్లు పడగొట్టాడని గుర్తు చేశాడు వసీమ్ అక్రమ్. ఆల్ రౌండర్ గా పాండ్యా ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకు ప్రధాన బలంగా మారనున్నాడని పాక్ దిగ్గజం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా జట్టు పటిష్టంగా ఉందని, స్వదేశంలో వరల్డ్ కప్ జరగడం వారికి అడ్వాంటేజ్ అని అక్రమ్ పేర్కొన్నాడు. మరి వసీమ్ అక్రమ్ అన్నట్లుగా పాండ్యా వరల్డ్ కప్ లో కీలకంగా మారుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.