iDreamPost

VIDEO: టీమిండియా బౌలర్లపై తీవ్ర ఆరోపణ! పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ కౌంటర్‌

  • Published Nov 04, 2023 | 1:39 PMUpdated Nov 04, 2023 | 1:39 PM

ఈ వరల్డ్‌ కప్‌లో సూపర్‌ బౌలింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థుల దుమ్ముదులుపుతున్న టీమిండియా బౌలర్లపై ఓ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ కొన్ని అర్థం లేని ఆరోపణలు చేశారు. వాటికి ఆ దేశ దిగ్గజ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..

ఈ వరల్డ్‌ కప్‌లో సూపర్‌ బౌలింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థుల దుమ్ముదులుపుతున్న టీమిండియా బౌలర్లపై ఓ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ కొన్ని అర్థం లేని ఆరోపణలు చేశారు. వాటికి ఆ దేశ దిగ్గజ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 04, 2023 | 1:39 PMUpdated Nov 04, 2023 | 1:39 PM
VIDEO: టీమిండియా బౌలర్లపై తీవ్ర ఆరోపణ! పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ కౌంటర్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా బౌలర్లు సూపర్‌ స్వింగ్‌లో ఉన్నారు. ముఖ్యంగా భారత పేస్‌ దళాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి జట్టు వణికిపోతున్నాయి. టోర్నీ ఆరంభంలో బుమ్రా, సిరాజ్‌ ఇండియన్‌ పేస్‌ భారాన్ని మోస్తే.. షమీ రాకతో టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ దుర్భేద్యంగా మారింది. గురువారం శ్రీలంకపై ముగ్గురు పేసర్లు నిప్పులు చెరిగారు. అయితే.. ఈ అసాధారణ ప్రదర్శన చూసి.. ప్రపంచం మొత్తం టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంటే.. కొంతమంది పాకిస్థానీయులు మాత్రం టీమిండియా బౌలర్లపై పడి ఏడుస్తున్నారు. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ హసన్‌ రజా టీమిండియా బౌలర్లకు వేరే బంతులను ఇస్తున్నారని, మిగతా బౌలర్లకు వేరే బంతులు ఇస్తున్నారని, అందుకు వాళ్లకు అంత స్వింగ్‌ లభిస్తోందని, ఆ బంతుల్లో ఏదో టెక్నాలజీ ఉందని అర్థం లేని వ్యాఖ్యలు చేశారు.

ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో సంచలనంగా మారాయి. ఇంత అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్న టీమిండియా బౌలర్లపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ జట్టు ఎంత దారుణమైన ప్రదర్శన చేస్తోందో అందరికి తెలిసిందే. ఆ జట్టు ఆఫ్ఘానిస్థాన్‌ చేతుల్లో కూడా ఓటమి పాలైంది. ఇప్పుడు సెమీస్‌ స్థానం కోసం అదృష్టాన్ని నమ్ముకుని ఆడుతోంది. తమ జట్టు ఇంత దీన స్థితిలో ఉండటం, మరో వైపు టీమిండియా మాత్రం అత్యాధ్బుతంగా దూసుకెళ్తుండటంతో కొంతమంది పాకిస్థానీయులు అస్సలు సహించలేకపోతున్నారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ క్రికెట్‌ నిపుణులు సైతం మండిపడ్డారు.

అయితే తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌, సుల్తాన్‌ ఆఫ్‌ స్వింగ్‌గా పేరున్న వసీం అక్రమ్‌ తాజాగా ఈ వివాదంపై స్పందించారు. హసన్‌కు చుకలు అంటిస్తూ.. ఎందుకు టీమిండియా బౌలర్ల గురించి అలా మాట్లాడి.. మీ పరువు పోగొట్టుకోవడంతో పాటు, ప్రపంచ ముందు మా పరువు కూడా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని, దాని కోసం వాళ్లు ఎంతో శ్రమించినట్లు ఉన్నారు, అందుకే మిగతా బౌలర్ల కంటే ఎంతో బాగా బౌలింగ్‌ చేస్తున్నారు. అంతే కానీ బాల్స్‌ మార్చడం అలాంటిది ఉండదు. అయినా.. అక్కడ అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలు ఉంటారు. టాస్‌ పడగానే బౌలింగ్‌ ఎంచుకున్న జట్టు రెండు బాల్స్‌ను ఎంపిక చేసుకుంటాయి, తర్వాత బ్యాటింగ్‌ టీమ్‌ కూడా ఓ రెండు బంతులను ఎంపిక చేసుకున్నారు. వాటినే అంపైర్లు మ్యాచ్‌లో వినియోగిస్తారు. ఆ బాల్స్‌ అంపైర్లు, రిఫరీల వద్దే ఉంటాయని చాలా క్లియర్‌గా చెప్పారు. ఇలా హసన్‌ అర్థం లేని కామెంట్స్‌కు అక్రమ్‌ ఇచ్చిన కౌంటర్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి