iDreamPost

స్టేటస్ బ్యాచ్ కు బిగ్ షాక్.. సినిమాలు రికార్డ్ చేసి స్టేటస్ పెడితే జైలుకే!

స్టేటస్ బ్యాచ్ కు బిగ్ షాక్.. సినిమాలు రికార్డ్ చేసి స్టేటస్ పెడితే జైలుకే!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ పరిశ్రమను అయినా బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య పైరసీ. ఈ పైరసీ కారణంగా నష్టపోయిన నిర్మాతలు ఎందరో ఉన్నారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసినా ఈ పైరసీ బూతం కారణంగా ముందే సినిమా లీకైపోయి భారీ నష్టాలు పొందిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంకో సమస్య ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెడుతోంది. అదేంటంటే.. వాట్సాప్ స్టేటస్ లు. అవును హీరో ఎంట్రీ నుంచి పంచ్ డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ ఇలా ప్రతి చిన్న సీన్ ని వీడియో తీసి స్టేటస్ లు పెట్టేస్తున్నారు. సినిమా వాళ్లు ఒక ట్విస్ట్ అనో, క్యామియో అప్పియరెన్స్ నో సీక్రెట్ గా ఉంచుతారు.

కానీ, వీళ్లు వాటిని స్టేటస్ ల ద్వారా రివీల్ చేస్తుంటారు. ఇకపై అలాంటి వారికి గట్టి షాకే తగలనుంది. అలా వీడియోలు తీసు స్టేటస్ లు పెట్టడం కూడా పైరసీ కిందికే వస్తుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అలా చేసిన వారికి జైలు శిక్ష, జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రం సినిమాటోగ్రఫీ బిల్లులో పలు సవరణలు చేసింది. 1984 తర్వాత కేంద్రం సినిమాటోగ్రఫీ బిల్లుకు మేజర్ సవరణలు చేసింది. సినిమా సర్టిఫికేషన్ విషయంలో కూడా సవరణలు చేశారు. ఈ బిల్లు రెండు సభల్లోనూ ఆమోదం పొందింది. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు 2023 లోక్ సభలో ఆమోదం పొందగా.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఎగువ సభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది.

ఈ బిల్లు ప్రకారం ఇకపై ఎవరైనా సినిమా పైరసీకి పాల్డితే కఠిన చర్యలు తప్పవు. సినిమా థియేటర్లలో వాట్సాప్ స్టేటస్ కోసం సెల్ ఫోన్లలో రికార్డింగు చేస్తూ పట్టుబడినా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ కొత్త సవరణల ప్రకారం పైరసీ చేస్తూ పట్టుబడితే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా విధించవచ్చు. సినిమా నిర్మాణానికి అయిన  మొత్తం ఖర్చులో 5 శాతం కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా సినిమా సర్టిఫికేషన్ విషయంలో కూడా మార్పులు చేశారు. ఇప్పటి వరకు యూ, యూఏ, ఏ సర్టిఫికేట్లను జారీ చేసేవాళ్లు. ఇక నుంచి యూఏ కేటగిరీలో యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+ అంటూ సర్టిఫికేట్స్ జారీ చేయనున్నారు. అనధికారికంగా సోషల్ మీడియాలో వీడియోలు ప్రసారం కాకుండా ఆమపడమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశం అంటూ కేంద్రం తెలిపింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి