iDreamPost

పెళ్లిపై హీరో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

Vishal Interesting Comments: కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంటారు.

Vishal Interesting Comments: కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంటారు.

పెళ్లిపై హీరో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, దర్శక, నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. విశాల్ కృష్ణా రెడ్డి అలియాస్ విశాల్. ప్రముఖ సినీ నిర్మాత జికె రెడ్డి తనయుడు విశాల్. అచ్చమైన తెలుగింటి అబ్బాయే.. కానీ తమిళ నాట స్థిరపడ్డాడు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విశాల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. యాక్షన్ భరిత చిత్రాలు ఎక్కువగా నటిస్తుంటాడు. అంతేకాదు తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ ద్వారా పలు చిత్రాలు నిర్మించారు. 2004 గాంధీ కృష్ణ దర్శకత్వంలో ‘చల్లామే’ (తెలుగు లో ప్రేమ చదరంగం) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా విశాల్ హీరోగా నటించిన ‘రత్నం’ మూవీ ప్రమోషన్స్ లో తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..

విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘రత్నం’ మూవీ ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు. కార్తియేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు లో శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ పై తెలుగు లో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా విశాలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి నాకు పెళ్లికి మించిన పెద్ద బాధ్యతలు ఉన్నాయి.. అవి పూర్తయిన తర్వాత తప్పకుండా మీ అందరికీ చెప్పి మరీ పెళ్లి చేసుకుంటా అని అన్నారు. కాకపోతే పెళ్లి కూతురు ఎవరో నాకు కూడా తెలియదు అని అన్నారు. రత్నం మూవీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చూసే సినిమా.. అస్సలు మిస్ కావొద్దు అని అన్నాడు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరు అంటే వెంటనే విశాల్ అని చెబుతుంటారు. విశాల్ గతంలో పలు ప్రేమ వ్యవహారాలు నడిపారని వార్తలు వచ్చాయి. అచ్చమైన తెలుగు హీరో అయినప్పటికీ తమిళ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. అయితే విశాల్ పెళ్లి విషయంలో ఇప్పటికీ ఎన్నో సార్లు ఎన్నో రకాల చర్చలు తెరపైకి వచ్చాయి. గతంలో ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లి అనుకోకుండా విడిపోయారు. ప్రస్తుతం విశాల్ తన సినీ కెరీర్ పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు. గతంలో తెలుగు లో వచ్చిన సింగం, యముడు సినిమాలకు దర్శకత్వం వహించిన హరీ.. విశాల్ నటించిన ‘రత్నం’ మూవీకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో భరణి, పూజ చిత్రాలు వచ్చాయి.‘రత్నం’ వీరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం. పూర్తి యాక్షన్, ఎంట్రటైన్ గా తెరకెక్కిన ఈ చిత్రం విజయంపై విశాల్ గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి