iDreamPost

Virender Sehwag: సెహ్వాగ్ విధ్వంసక ఇన్నింగ్స్​కు 14 ఏళ్లు.. అలాంటి బ్యాటింగ్ నీకే సాధ్యం బాస్!

  • Author singhj Published - 01:03 PM, Tue - 5 December 23

వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ గర్జించిన రోజు అది. బౌలర్ అనేది చూడకుండా విచక్షణా రహితంగా బౌండరీలు, సిక్సులతో వీరూ అలరించిన ఆ ఇన్నింగ్స్​కు 14 ఏళ్లు పూర్తయ్యాయి.

వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ గర్జించిన రోజు అది. బౌలర్ అనేది చూడకుండా విచక్షణా రహితంగా బౌండరీలు, సిక్సులతో వీరూ అలరించిన ఆ ఇన్నింగ్స్​కు 14 ఏళ్లు పూర్తయ్యాయి.

  • Author singhj Published - 01:03 PM, Tue - 5 December 23
Virender Sehwag: సెహ్వాగ్ విధ్వంసక ఇన్నింగ్స్​కు 14 ఏళ్లు.. అలాంటి బ్యాటింగ్ నీకే సాధ్యం బాస్!

సంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ అయిన టెస్టుల్లో అప్పటివరకు అంతా స్లోగానే బ్యాటింగ్ చేసేవారు. ఆ ప్లేయర్ల్, ఈ ప్లేయర్‌‌.. ఆ టీమ్, ఈ టీమ్ అనే తేడా లేదు. దాదాపుగా అందరూ ఒకే రకంగా ఆడేవారు. వికెట్లు కాపాడుకోవడం, చెత్త బాల్ వస్తే తప్ప షాట్లకు ఆడకపోవడం, క్రీజులో కుదురుకున్నాకే ఎక్కువ షాట్లు ఆడటం.. దాదాపుగా ఇదే ఫార్మాలాను అందరూ ఫాలో అయ్యేవారు. లోయరార్డర్​లో వచ్చే బ్యాటర్స్ తప్పితే ఎవరూ హిట్టింగ్​కు వెళ్లేవారు కాదు. అప్పటి పిచ్​లు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​కు బాగా సహకరించేవి. పేసర్లకు స్వింగ్, స్పిన్నర్లకు మంచి టర్న్ దొరికేది. అందుకే బ్యాటర్లు తమ జోన్​లో పడితేనో లేదా చెత్త బాల్ వస్తేనే షాట్స్ ఆడేవారు. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ తీయడం.. గ్యాప్స్​లోకి బంతిని పంపడంపై ఫోకస్ పెట్టేవారు.

2000వ దశకంలో టెస్ట్ క్రికెట్ ఆడిన తీరు గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అప్పట్లో లాంగ్ ఫార్మాట్​లో కొందరు అటాకింగ్ గేమ్​కు ప్రయత్నించినా రెగ్యులర్​గా మాత్రం అదే రేంజ్​లో ఆడలేకపోయారు. కానీ సరిగ్గా అదే టైమ్​లో ఒక విధ్వంసకారుడు వచ్చాడు. అతడే టీమిండియా డాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. అప్పటికే పదేళ్లకు పైగా జట్టులో ఆడుతున్న సెహ్వాగ్ క్రమంగా టెస్టుల్లో అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. బౌలింగ్ వేస్తోంది ప్రపంచ నంబర్ వన్ పేసరైనా, స్పిన్నరైనా అతడు పట్టించుకునేవాడు కాదు. పిచ్ ఎలా రియాక్ట్ అవుతోంది? దేనికి సహకరిస్తోంది? ఇంకా ఎంత స్కోరు కొట్టాలి? అనే లెక్కలేవీ వేసుకునేవాడు కాదు. క్రీజులోకి వచ్చాడా ఇక బాదుడు షురూ. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీకి పంపడమే అతడి పని.

టెస్టు క్రికెట్​లో ఇప్పుడు బజ్​బాల్ ఫార్ములా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ సెహ్వాగ్ 2009లోనే బజ్​బాల్​ను మించిన అటాకింగ్​ గేమ్​తో సత్తా చాటాడు. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ఒక టెస్టులో 253 బంతుల్లోనే 293 రన్స్ చేసి అందర్నీ షాక్​కు గురిచేశాడు. అతడి ఇన్నింగ్స్​లో 7 సిక్సులతో పాటు ఏకంగా 40 బౌండరీలు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 202 రన్స్ చేశాడు వీరూ. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్​ ఎంత విధ్వంసకరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరేంద్రుడి తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా ఆ మ్యాచ్​లో భారత్ 9 వికెట్లకు 726 రన్స్ చేసింది.

ఆ మ్యాచ్​లో ఇన్నింగ్స్ 24 పరుగులతో గెలిచిన టీమిండియా.. మూడు మ్యాచుల ఆ సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఆ రోజు ఏ లంక బౌలర్​నూ సెహ్వాగ్ వదల్లేదు. లెజెండరీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్​ను కూడా కనికరించేదు వీరూ. ముత్తయ్య బౌలింగ్​లో 76 బంతులు ఎదుర్కొన్న భారత మాజీ ఓపెనర్ 84 రన్స్ చేశాడు. సెహ్వాగ్​తో పాటు మరో ఓపెనర్ మురళీ విజయ్ (87), రాహుల్ ద్రవిడ్ (74), సచిన్ టెండూల్కర్ (53), వీవీఎస్ లక్ష్మణ్ (62) రన్స్ చేశారు. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని (100) పించ్ హిట్టింగ్​తో భారత్ భారీ స్కోరు చేసింది. జహీర్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగడంతో లంకకు ఓటమి తప్పలేదు. సెహ్వాగ్ ఇన్నింగ్స్​కు 14 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ అతడి బ్యాటింగ్​ను ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్నో మ్యాచుల్లో ఓపెనర్​గా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడినప్పటికీ లంకపై ఆడిన ఈ నాక్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి. మరి.. సెహ్వాగ్ 293 ఇన్నింగ్స్​ తలచుకుంటే మీకు ఏం అనిపిస్తుందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: భారత్​ను ఓడించడానికి ఆ ఒక్క ఫార్ములా చాలంటున్న మెకల్లమ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి