iDreamPost

RCB vs SRH: ఉప్పల్‌ గ్రౌండ్‌లో తెలుగువారికి దండం పెట్టిన కోహ్లీ! ఎందుకంటే..?

  • Published Apr 26, 2024 | 9:32 AMUpdated Apr 26, 2024 | 9:32 AM

Virat Kohli, Hyderabad, RCB vs SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే.. ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ కోహ్లీ.. తెలుగు వారికి రెండు చేతులెత్తి దండం పెట్టాడు. అలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Hyderabad, RCB vs SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే.. ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ కోహ్లీ.. తెలుగు వారికి రెండు చేతులెత్తి దండం పెట్టాడు. అలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 26, 2024 | 9:32 AMUpdated Apr 26, 2024 | 9:32 AM
RCB vs SRH: ఉప్పల్‌ గ్రౌండ్‌లో తెలుగువారికి దండం పెట్టిన కోహ్లీ! ఎందుకంటే..?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు విజయం సాధించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 35 రన్స్‌ తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఆరంభంలో వేగంగా ఆడిన కోహ్లీ.. రెండు వికెట్లు పడిన తర్వాత స్లో అయిపోయాడు. ఫిఫ్టీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో అవుట్‌ అయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో తెలుగు వారికి కోహ్లీ చేతులెత్తి దండం పెట్టాడు. కోహ్లీ అలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు హోం గ్రౌండ్‌. కచ్చితంగా ఎస్‌ఆర్‌హెచ్‌కే ఇక్కడ భారీ స్థాయిలో మద్దతు దొరుకుతుంది. కానీ, ఆర్సీబీలో ఉంది విరాట్‌ కోహ్లీ కాబట్టి.. ఆర్సీబీకి సపోర్ట్‌ చేయని వారు కూడా కోహ్లీ అంటే పడిచచ్చిపోతారు. తెలుగు వారిలోకి కూడా విరాట్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను చాలా మంది సపోర్ట్‌ చేశారు. అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్‌ కూడా పెద్ద ఎత్తున మ్యాచ్‌ చూసేందుకు వచ్చారు. అయితే.. కోహ్లీ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో.. ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్‌, అటు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ కోహ్లీ.. కోహ్లీ.. అంటూ తమ అభిమానం చాటుకున్నారు. తెలుగు వారి అభిమానం చూసి.. కాస్త ఎమోషనల్‌ అయిన కింగ్‌ కోహ్లీ.. వారందరికి చేతులెత్తి దండం పెట్టి.. వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. కోహ్లీ చేసిన ఈ పనితో తెలుగు క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కోహ్లీ 51, డుప్లెసిస్‌ 25, రజత్‌ పాటిదార్‌ 50, గ్రీన్‌ 37 పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో నటరాజన్‌ 2, జయదేవ్‌ ఉనద్కట్‌ 3 వికెట్లతో సత్తా చాటారు. ఇక 207 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసి.. 35 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ 31, షాబాజ్‌ అ‍హ్మద్‌ 40, కెప్టెన్‌ కమిన్స్‌ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, కామెరున్‌ గ్రీన్‌ రెండేసి వికెట్లతో రాణించారు. విల్‌ జాక్స్‌, యశ్‌ దయాల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మొహమ్మద్‌ సిరాజ్‌ వికెట్లు తీయకపోయినా.. 4 ఓవర్లలో కేవలం 20 రన్స్‌ మాత్రమే ఇచ్చి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ తెలుగు క్రికెట్‌ అభిమానులకు దండం పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి