iDreamPost

Virata Parvam : ఇంతకీ రానా సినిమాను తీసుకొస్తారా లేదా

Virata Parvam : ఇంతకీ రానా సినిమాను తీసుకొస్తారా లేదా

గత కొన్ని నెలలుగా దగ్గుబాటి ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మాట వాస్తవం. వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం 2 రెండూ ఓటిటిలో రావడం ఒక కారణమైతే విరాట పర్వం రిలీజ్ గురించి అసలు ఏ ఊసూ లేకపోవడం మరో రీజన్. ఇంతకీ దాన్ని విడుదల చేస్తారా లేక అలాగే నెలల తరబడి ల్యాబ్ లో మగ్గబెడతారా అనేది వాళ్ళ ప్రశ్న. రానా సాయి పల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ నిర్మాత సురేష్ బాబు దీని గురించి ఎక్కడా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రానాకు భీమ్లా నాయక్ రిలీజై మంచి పేరు తీసుకొచ్చాకైనా విరాట పర్వం తాలూకు అప్ డేట్స్ ఇచ్చే ఆలోచన చేయకపోవడం అంతు చిక్కడం లేదు.

నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన విరాట పర్వంలో ప్రియమణి, నందితా దాస్ లాంటి క్యాస్టింగ్ చాలానే ఉంది. 90 దశకం నాటి నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ని కథాంశంగా తీసుకున్నారు. టీజర్ వదిలి ఎన్ని నెలలు అయ్యిందో చెప్పడం కష్టం. దానికి మంచి స్పందన వచ్చినా సరే ఆ తర్వాత ఉలుకు పలుకు లేదు. అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో సినిమాకే ఇలా జరిగితే ఇక బడ్జెట్ చిత్రాల పరిస్థితి ఏంటని ఇండస్ట్రీలోనూ టాక్ నడుస్తోంది. థియేటర్ పరంగా వర్కౌట్ కాదనుకుంటే ఓటిటికి ఇఛ్చినా సరిపోతుంది. కనీసం ఆ పని కూడా చేయడం లేదు. మొక్కుబడిగా అప్పుడప్పుడు పోస్టర్లు వదలడం తప్ప ఏమి చేయడం లేదు.

అటు చూస్తేనేమో విరాట పర్వం తర్వాత చాలా ఆలస్యంగా మొదలైన ఎన్నో సినిమాలు రిలీజై ఓటిటిలో కూడా వచ్చేసాయి. కానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బిజినెస్ విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉండే సురేష్ బాబు ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పెట్టుబడులు నెలల తరబడి ఈ రూపంలో బ్లాక్ అయిపోవడం ఎంత నష్టమో ఆయనకు తెలియంది కాదు. అలాంటప్పుడు ఏదో ఒక రూపంలో విరాట పర్వంని బయటికి తీసుకొస్తే సరిపోతుంది. ఇప్పటికే జనంలో ఆసక్తి దాదాపు తగ్గిపోయిన ఈ సినిమా మీద మళ్ళీ బజ్ తీసుకురావడం అంత సులభం కాదు. ఇప్పటికైనా లేట్ చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి

Also Read : RRR : అంచనాలను మించేసిన ట్రిపులార్ సంబరం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి