SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజ్ మాస్టర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి గురించి క్రికెట్ అభిమాని ఉండడు. ప్రపంచ క్రికెట్‌లో అతనో స్టార్. ఇండియాలోనే కాదు ప్రపంచంలో క్రికెట్ గురించి కనీస అవకాగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ కోహ్లీ గురించి తెలిసి ఉంటుంది. అదీ.. అతని క్రేజ్. కింగ్ కోహ్లీగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన విరాట్.. క్రేజ్ కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో కోహ్లీకి అభిమానులున్నారు. క్రికెటర్లు, క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా కోహ్లీ అంటే ఎంతో అభిమానం చూపిస్తారు.
అయితే.. మన శత్రుదేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి అభిమానులు ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ ఆటకు ఫిదా అయిపోయిన చాలా మంది పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీ అంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. క్రికెట్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఓటమిని ఆయా దేశాల అభిమానులు అస్సలు తట్టుకోలేరు. ప్రత్యర్థి ఆటగాడు తొలి బంతికే అవుటైపోవాలని కోరుకుంటూ ఉంటారు.
కానీ, కోహ్లీ విషయంలో పాకిస్థాన్ అభిమానులు మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉంటారు. ఇండియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవాలని బలంగా కోరుకుంటారు. అదే సమయంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని కూడా కోరుకుంటారు. అది వాళ్లకు కోహ్లీ మీదున్న అభిమానం. ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ త్వరగా అవుటైనందుకు ఇండియన్ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో.. కొంతమంది పాక్ అభిమానులు కూడా అంతే బాధపడ్డారు. మ్యాచ్ తర్వాత తమ బాధను సైతం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో కోహ్లీ ఏ రేంజ్ ఫాలోయింగ్ ఇగో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. పాకిస్థాన్‌లో బలుచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇసుకలో కోహ్లీ భారీ ఆర్ట్‌ను రూపొందించారు పాకిస్థానీ విరాట్ కోహ్లీ అభిమానులు. ఆ ఆర్ట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కిందున్న ఆ వీడియోను మీరూ చూసి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A beautiful sand artwork from Virat Kohli’s fans in Gwadar in Balochistan, Pakistan 🇵🇰🇮🇳♥️ #AsiaCup2023 #AsiaCup pic.twitter.com/a7PzKFYduW
— Farid Khan (@_FaridKhan) September 3, 2023
ఇదీ చదవండి: ఆసియా కప్ నుంచి ఇంటికి వచ్చేసిన బుమ్రా! ఎందుకంటే?