iDreamPost
android-app
ios-app

వీడియో: ఇలాంటి క్యాచ్‌లు కోహ్లీకే సాధ్యం.. సింగిల్‌ హ్యాండ్‌ గణేష్‌!

  • Published Jul 28, 2023 | 8:25 AM Updated Updated Jul 28, 2023 | 9:20 AM
  • Published Jul 28, 2023 | 8:25 AMUpdated Jul 28, 2023 | 9:20 AM
వీడియో: ఇలాంటి క్యాచ్‌లు కోహ్లీకే సాధ్యం.. సింగిల్‌ హ్యాండ్‌ గణేష్‌!

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. బుల్లెట్‌ వేగంతో వెళ్లే బాల్‌ను సైతం ఉడుము పట్టుపట్టినట్లు లటుక్కున పట్టేసుకుంటాడు. తాజాగా వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలోనూ ఓ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. సాధారణంగా అందరూ కోహ్లీనికి కింగ్‌ కోహ్లీ అని పిలుస్తుంటారు. కానీ ఈ క్యాచ్‌ చూస్తే.. కోహ్లీని కింగ్‌ ఆఫ్‌ క్యాచ్చింగ్‌ అని కూడా పిలుస్తారేమో. అంత గొప్పగా ఉందా క్యాచ్‌. మెరుపు వేగంతో స్పందించి, సింగిల్‌ హ్యాండ్‌తో చాలా సింపుల్‌ అనిపించేలా సూపర్‌ డూపర్‌ క్యాచ్‌ పట్టాడు.

మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగకపోయినా.. టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా నిలిచాడంటే అందుకు ఈ క్యాచ్చే కారణం. ఈ క్యాచ్‌ను కళ్లుచెదిరే క్యాచ్‌ అనేకంటే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కళ్లమెచ్చే క్యాచ్‌ అనొచ్చు. అంత ముచ్చటగా ఉంది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ నాలుగో బంతిని రొమారియో షెపర్డ్(0) డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అది కాస్తా.. ఎడ్జ్‌ తీసుకుని సెకండ్‌ స్లిప్‌ వైపు దూసుకెళ్లింది. అక్కడే కాచుకుని ఉన్న కోహ్లీ, మెరుపు వేగంతో దాన్ని ఒంటిచేత్తో అందుకున్నాడు. కళ్లుమూసి తెరిచేలోగా.. విండీస్‌ వికెట్‌ కోల్పోయింది. కోహ్లీ ఫీల్డింగ్‌కు షాకైన షెపర్డ్‌ చేసేదేంలేక పెవిలియన్‌ బాట పట్టాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన వెస్టిండీస్‌ 23 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ హోప్‌ 43 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. కుల్దీప్‌ యాదవ్‌ 4, జడేజా 3 వికెట్లతో సత్తాచాటారు. పాండ్యా, ముఖేష్‌ కుమార్‌, ఠాకూర్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 22.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయిన 118 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 52 పరుగులతో రాణించాడు. గిల్‌(7), సూర్యకుమార్‌(19), పాండ్యా(5), ఠాకూర్‌(1) విఫలమయ్యారు. జడేజా 16, రోహిత్‌ శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ వీడియో కింద ఉంది. మీరూ చూసి ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ విమర్శలను పట్టించుకోను.. నా ఫుల్ ఫోకస్ దాని పైనే..: రోహిత్ శర్మ