SNP
SNP
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. ఆటగాళ్ల మాట యుద్ధాలు, మ్యాచ్ మధ్యలో చిన్న వాగ్వాదాలతో సాగే ఓ రసవత్తరమైన క్రికెట్ ఫైట్. కానీ, ఈ మధ్య కాలంలో ఆటగాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ పెరిగిపోవడంతో.. అలాంటి వేడి వాతావరణం మైదానంలో కనిపించడం లేదు. దీంతో.. భారత్-పాక్ మ్యాచ్‌లో ఉండే ఆ ఫైరీ ఎలిమెంట్ కాస్త మిస్ అవుతున్నట్లు క్రికెట్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గతంలో సచిన్ వర్సెస్ అక్తర్, సెహ్వాగ్ వర్సెస్ అక్తర్, గంభీర్ వర్సెస్ అఫ్రిదీ, ద్రావిడ్ వర్సెస్ అక్తర్ ఇలా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మినీ యుద్ధాన్ని తలపించేవి. కానీ, ఇప్పుడంతా చాలా కూల్ కూల్‌గా సాగిపోతుంది.
ఎంత కలిసిపోయినా.. తరతరాలుగా ఉన్న వైరానికి చిన్న రవ్వచాలు అగ్గి రాజేయాడానికి.. అలాంటి అగ్గిరవ్వను పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ రాజేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా ఇండియా పాకిస్థాన్ మధ్య లీగ్ దశలో సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రౌఫ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేపట్టింది. భారత టాపార్డర్ కుప్పకూలడంతో.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడి.. టీమిండియాను నిలబెట్టారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో 82 పరుగులతో అద్భుతంగా ఆడాడు.
అయితే.. రౌఫ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ బాబర్ అజమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో రౌఫ్ వేలు చూపిస్తూ.. బయటికి వెళ్లిపోయాలని ఇషాన్ కిషన్‌పై నోరు పారేసుకున్నాడు. ఈ ఘటనతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే.. ఇషాన్ కిషన్‌కు రౌఫ్ వేలు చూపిస్తూ.. చేసిన ఓవర్ యాక్షన్‌ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూసిన కోహ్లీ.. కాస్త కోపంగా కనిపించాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో ఇచ్చిన కోటింగ్ సరిపోలేదేమో.. మళ్లీ నెక్ట్స్ మ్యాచ్‌లో రౌఫ్‌కు కోహ్లీ సరిగ్గా బుద్ధి చెబుతాడంటూ భారత్ క్రికెట్ అభిమానులు ఆ వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు.
ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో.. కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. పాక్ బౌలింగ్ ఎటాక్‌ను చిత్తుచిత్తు కొడుతూ.. 356 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ఆదివారం కొన్ని ఓవర్లు జరగ్గా.. టీమిండియా ఓపెనర్లు రోహిత్-గిల్ పాక్ పేసర్ల తుప్పురేగ్గొట్టారు. ముఖ్యంగా రోహిత్ కొట్టిన ఒక స్టేయిట్ షాట్ అయితే రౌఫ్ వేళ్ల బలంగా తగిలింది. దాంతో పాటు కండరాలు కూడా పట్టేయడంతో సోమవారం రిజర్వ్ డేలో రౌఫ్ బౌలింగ్‌కు దిగలేదు. కేవలం 5 ఓవర్లు వేశాడు. ఆ 5 ఓవర్లో కూడా 27 పరుగులు సమర్పించుకున్నాడు. రోహిత్-కోహ్లీ బ్యాటింగ్‌తో ఒత్తిడిలోకి వెళ్లిన రౌఫ్ ఏకంగా 6 వైడ్లు వేశాడు.
అయితే.. రౌఫ్ సోమవారం కూడ ఆడి ఉంటే.. కోహ్లీ టార్గెట్ చేసి మరీ కొట్టేవాడని ఫ్యాన్ అంటున్నారు. ఇషాన్ కిషన్‌కు కోహ్లీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఐపీఎల్‌లో ఇషాన్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో కోహ్లీ అతని మాట్లాడిన విషయం తెలిసిందే. ఇలా ఇషాన్ కిషన్‌కు రౌఫ్ వేలు చూపించడంపై కోహ్లీకి కోపం వచ్చినట్లు ఉందని, అందుకే పాక్‌ను ఓడించాలనే ఉద్దేశంతోనే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, తమ్ముడిలా చూసుకునే కిషన్‌ను ఎవరైనా ఏదైనా అంటే అన్న లాంటి కోహ్లీ ఊరుకుంటాడా.. ఇలానే సెంచరీతో విరుచుకుపడతాడంటూ.. క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Last match Harish Rauf agression towards Ishan Kishan👇
Todays Virat Show Time…#INDvPAK #September11 #AsiaCup2023 #ViratKohli #BHAvsPAK pic.twitter.com/eaL6BSLSgS
— Jigar Upadhyay (@12JIGARUPADHYAY) September 11, 2023
Haris Rauf’s send-off to Ishan Kishan 👋 👀 pic.twitter.com/yyGlIingPt
— ESPNcricinfo (@ESPNcricinfo) September 3, 2023
ఇదీ చదవండి: VIDEO: రాంగ్ షాట్ ఆడి.. రక్తం చిందించిన పాక్ బ్యాటర్!