SNP
Virat Kohli, Strike Rate, RCB vs GT: విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో.. ధనా ధన్‌క్రికెట్‌లో కూడా తన సత్తా చాటుతుంటే.. కొంతమంది అర్థం లేకుండా అతనిపై విమర్శలు చేస్తున్నారు. వాటికి తాజాగా కోహ్లీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, Strike Rate, RCB vs GT: విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో.. ధనా ధన్‌క్రికెట్‌లో కూడా తన సత్తా చాటుతుంటే.. కొంతమంది అర్థం లేకుండా అతనిపై విమర్శలు చేస్తున్నారు. వాటికి తాజాగా కోహ్లీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 71.43 యావరేజ్, 147.49 స్ట్రైక్‌రేట్‌తో 500 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 113(నాటౌట్) అత్యధిక స్కోర్‌గా ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్‌ను కూడా కలిగి ఉన్నాడు. జట్టు పరంగా ఆర్సీబీ విఫలం అవుతున్నా.. తానొక్కడే ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తనతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు కూడా ఫామ్‌లోకి రావడంతో ఆర్సీబీ మళ్లీ విజయాల బాట పట్టింది. అయినా కూడా.. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తక్కువ స్ట్రైక్‌రేట్‌తో, స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడని చాలా మంది కామెంట్స్ చేశారు. వారందరికీ తాజాగా కోహ్లీ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ‘చాలా మంది నా స్ట్రైక్‌రేట్ గురించి, స్పిన్నర్లను సరిగ్గా ఆడలేకపోతున్నాను అనే విషయాల గురించి మాట్లాడుతున్నారు. నేనైతే టీమ్ కోసం మ్యాచ్‌లు గెలవడానికే ఆడుతున్నాను, గత 15 ఏళ్లుగా నేను చేస్తుంది ఇదే. అలా మాట్లాడే వాళ్లు ఆ పరిస్థితుల్లో ఉన్నారో లేరో నాకైతే తెలియదు. బాక్సుల్లో కూర్చోని తమకు తోచింది మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది ఊహించుకుని మాట్లాతూ ఉంటారు. అయితే.. ఎవరైతే క్రికెట్ ఆడి ఉంటారో, వాళ్లకు అర్థం అవుతుంది, నా ఆట గురించి, ఇది నాకు మజిల్ మెమొరీ’ అంటూ విరాట్ కోహ్లీ తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్ లాంటి విధ్వంసకరమైన టోర్నీలో 147 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో 10 మ్యాచ్‌ల్లో 500 పరుగులు చేసి.. టాప్ రన్ స్కోరర్‌గా నిలవడం విమర్శకులకు చిన్న విషయంలా అనిపిస్తుందా అంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.
అయినా.. కోహ్లీ ఆడుతున్న ఆర్సీబీ టీమ్ పరిస్థితి వేరు. స్టార్టింగ్‌లో ఆ టీమ్‌లో ఏ ఒక్క ఆటగాడు కూడా సరైన ఫామ్‌లో లేడు. ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్ ఇలా ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా.. కోహ్లీ ఒక్కడే టీమ్‌ను ముందుకు నడిపించాడు. ఆర్సీబీ అంత చెత్త ప్రదర్శన చేస్తుంటే మరో ఆటగాడు అయిఉంటే.. ఆత్మవిశ్వాసం కోల్పోయే వాడు. కానీ, కోహ్లీ ఇప్పటికీ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో టాప్ 5లో ఉన్న అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో కోహ్లీ సెకండ్ హైయ్యొస్ట్ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. అయినా కూడా.. కొంత మంది కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేస్తుంటాడు. అయినా.. క్రీజ్‌లోకి వచ్చి అడ్డిగుడ్డిగా నాలుగు షాట్లు ఊపేసి.. అవుట్ అవ్వడానికి అక్కడుంది అల్లాటప్ప ఆటగాడు కాదు, మ్యాచ్ విన్నర్ విరాట్ కోహ్లీ. టీమ్‌ను గెలిపించడం కోసం ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసని క్రికెట్ అభిమానులు కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరి తన స్ట్రైక్‌రేట్ వస్తున్న విమర్శలకు కోహ్లీ ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
No real fans of Virat Kohli fans will scroll without liking this tweet 😎..#RCBvGT #GTvsRCB #viralvideo#ViratKohli𓃵 pic.twitter.com/M5QoQWev4a
— Vikku (@Vikesh_Chabri) April 29, 2024