iDreamPost
android-app
ios-app

కోహ్లీ ఫామ్​లోకి రావాలంటే అదొక్కటే దారి.. మాజీ క్రికెటర్ సజెషన్!

  • Published Jun 19, 2024 | 8:50 PM Updated Updated Jun 19, 2024 | 8:50 PM

పొట్టి కప్పులో ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్నాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. లీగ్ స్టేజ్​లో ఫ్లాప్ అయిన కింగ్.. సూపర్-8లో అయినా గాడిన పడాలని అనుకుంటున్నాడు.

పొట్టి కప్పులో ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్నాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. లీగ్ స్టేజ్​లో ఫ్లాప్ అయిన కింగ్.. సూపర్-8లో అయినా గాడిన పడాలని అనుకుంటున్నాడు.

  • Published Jun 19, 2024 | 8:50 PMUpdated Jun 19, 2024 | 8:50 PM
కోహ్లీ ఫామ్​లోకి రావాలంటే అదొక్కటే దారి.. మాజీ క్రికెటర్ సజెషన్!

టీ20 ప్రపంచ కప్-2024 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్​తో ఆడియెన్స్​కు మస్తు వినోదాన్ని పంచిన జట్లు.. సూపర్-8 ఫైట్స్​తో మరింత ఎంటర్​టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక మీదట అన్నీ నాకౌట్ మ్యాచ్​లే కానున్నాయి. ఓడితే రేసులో ఉండటం కష్టం.. కాబట్టి గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డిందేకు టీమ్స్ రెడీ అవుతున్నాయి. సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే నెగ్గడం తప్ప ఇంకో ఆప్షన్ లేకపోవడంతో తమ రియల్ టాలెంట్​ను బయటకు తీసేందుకు ఆటగాళ్లు కూడా సన్నద్ధమవుతున్నారు. టీమిండియా ప్లేయర్లు కూడా నెట్స్​లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. సూపర్ పోరులో ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ బెండు తీయాలని ఫిక్స్ అయ్యారు.

సూపర్-8లో భాగంగా రేపు డేంజరస్ టీమ్ ఆఫ్ఘానిస్థాన్​ను ఢీకొట్టనుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో ఘన విజయం సాధించి ఆసీస్, బంగ్లాకు వార్నింగ్ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు కింగ్ కోహ్లీ ఫామ్​ జట్టును ఇబ్బంది పెడుతోంది. మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 5 పరుగులు చేసిన విరాట్.. అందర్నీ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. మ్యాన్ విన్నర్ అవుతాడనుకుంటే టీమ్​కు భారంగా మారాడు. రెగ్యులర్​గా ఆడే థర్డ్ డౌన్​లో కాకుండా ఓపెనర్​గా వచ్చి అతడు ఫెయిల్ అవుతున్నాడు. ఫస్ట్ బాల్​ నుంచి గుడ్డిగా బాల్​ను ఊపేందుకు ప్రయత్నించి బౌలర్లకు దొరికిపోతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అతడికి కీలక సూచన చేశాడు. ఫామ్ అందుకోవాలంటే కోహ్లీ దూకుడును వదిలేయాలని చెప్పాడు.

‘విరాట్​ కోహ్లీ తిరిగి గాడిన పడాల్సిన సమయం వచ్చేసింది. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో అతడు ఫామ్​ను అందుకోవాలి. తిరిగి టచ్​లోకి రావడానికి ఈ మ్యాచ్​ను వాడుకోవాలి. ఆఫ్ఘాన్ చిన్న టీమ్ అని చెప్పి ఈ మ్యాచ్​తో ఫామ్​ను అందుకోవాలని చెప్పడం లేదు. కోహ్లీ సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసు. అతడు బిగ్ మ్యాచెస్​ ప్లేయర్. వరల్డ్ కప్​కు ముందు అతడు పరుగుల వరద పారించాడు. ఆ లయను తిరిగి అందుకోవాలి. మెగాటోర్నీలో కోహ్లీ అగ్రెసివ్​నెస్ వల్ల ఫెయిల్ అవుతున్నాడు. అనవసర దూకుడు అతడ్ని పరుగులు చేయకుండా ఆపుతోంది. అటాకింగ్​ అప్రోచ్​ను పక్కనబెట్టి క్రీజులో కుదురుకోవడంపై అతడు ఫోకస్ చేయాలి. వికెట్ మీద నిలదొక్కుకుంటే పరుగులు అవే వస్తాయి. పిచ్​పై సెటిల్ అయితే ఫామ్​ అదే వచ్చేస్తుంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కోహ్లీ క్రీజులో ఎక్కువ టైమ్ గడపాలని, అక్కడ సెటిల్ అవడం మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. ఈ పని చేస్తే అతడికి తిరుగుండదని స్పష్టం చేశాడు. మరి.. కోహ్లీ ఫామ్ అందుకోవాలంటే ఏం చేయాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.