iDreamPost
android-app
ios-app

Virat Kohli: వీడియో: ఆ ప్లేయర్ పేరు వినగానే సీరియస్ అయిన కోహ్లీ! ఏం చేశాడంటే..?

  • Published May 17, 2024 | 8:01 PM Updated Updated May 17, 2024 | 8:03 PM

టీమిండియా స్టార్ బ్యాటర్‌‌ విరాట్ కోహ్లీ అందరు ఆటగాళ్లతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు. అపోజిషన్ టీమ్ ప్లేయర్లతోనూ అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటోడు ఒకరి పేరు చెబితే మాత్రం సీరియస్ అవుతున్నాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్‌‌ విరాట్ కోహ్లీ అందరు ఆటగాళ్లతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు. అపోజిషన్ టీమ్ ప్లేయర్లతోనూ అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటోడు ఒకరి పేరు చెబితే మాత్రం సీరియస్ అవుతున్నాడు.

  • Published May 17, 2024 | 8:01 PMUpdated May 17, 2024 | 8:03 PM
Virat Kohli: వీడియో: ఆ ప్లేయర్ పేరు వినగానే సీరియస్ అయిన కోహ్లీ! ఏం చేశాడంటే..?

టీమిండియా స్టార్ బ్యాటర్‌‌ విరాట్ కోహ్లీ అందరు ఆటగాళ్లతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు. అపోజిషన్ టీమ్ ప్లేయర్లతోనూ అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. మ్యాచుల సమయంలో గ్రౌండ్​లో సీరియస్​గా కనిపించే కోహ్లీ.. ఆఫ్​ ది ఫీల్డ్ మాత్రం చాలా సరదాగా ఉంటాడు. అందరితో ఇట్టే కలసిపోతాడు. క్రికెట్​తో పాటు ఇతర క్రీడలకు చెందిన ఆటగాళ్లతోనూ అతడు ఫ్రెండ్​షిప్ చేస్తుంటాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్, భారత స్టార్ ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రితో కోహ్లీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలా ఇతర స్పోర్ట్స్ స్టార్స్​తోనూ స్నేహం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాంటోడు ఒకరి పేరు చెబితే మాత్రం సీరియస్ అవుతున్నాడు.

ఆ ప్లేయర్ పేరు వినగానే సీరియస్ అయ్యాడు కోహ్లీ. ఆయన పేరు ఇప్పుడు ఎందుకు తీశావ్ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూశాడు. ఈ ఘటన ఆర్సీబీ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో చోటుచేసుకుంది. బెంగళూరు ఫ్రాంచైజీతో ఏళ్లుగా ట్రావెల్ అవుతూ అందర్నీ నవ్విస్తున్న మిస్టర్ నాగ్స్ తాజాగా కింగ్​ను ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు విరాట్. తన కూతురు వామిక గురించి కూడా మాట్లాడాడు. అలా ఇంటర్వ్యూ ఆహ్లాదంగా సాగిపోతున్న సమయంలో సునీల్.. అంటూ టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రస్తావన తీసుకొచ్చాడు నాగ్స్. అంతే ఆ మాట వినగానే కోహ్లీ సీరియస్ అయ్యాడు. నాగ్స్ వైపు ఉరిమి చూసిన కింగ్.. ఆ తర్వాత తన కోపాన్ని లోపలే అణచుకుంటూ బలవంతంగా ఓ నవ్వు నవ్వాడు.

‘నేను కామెంటేటర్​ను కాను.. కామన్​మ్యాన్​ను కాబట్టే నాతో ఫ్రెండ్​గా ఉన్నావ్ కదా? నీ గురించి నీ స్నేహితుడు చాలా మంచి విషయాలు చెప్పాడు’ అని నాగ్స్ అన్నాడు. దీంతో ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని కోహ్లీ అడిగాడు. నాగ్స్ వెంటనే సునీల్.. అని ఆగిపోయాడు. దీంతో గవాస్కర్ అనుకొని కోహ్లీ సీరియస్​గా చూశాడు. అయితే కింగ్ ఆగ్రహాన్ని గ్రహించిన నాగ్స్.. సునీల్ ఛెత్రి అని కవర్ చేశాడు. దీంతో కోహ్లీ డిఫరెంట్​గా నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, గవాస్కర్​-కోహ్లీకి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్​ సీజన్ మొదట్లో విరాట్ నెమ్మదిగా ఆడటంతో అతడి స్ట్రైక్ రేట్​ను టార్గెట్ చేసుకొని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. దీంతో స్పీడ్​గా రన్స్ చేస్తూ బ్యాట్​తో కౌంటర్ ఇచ్చాడు కోహ్లీ. అలాగే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్​లో గవాస్కర్​కు ఇన్​డైరెక్ట్​ పంచ్​లు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో విరాట్​ దగ్గర సరదాగా సునీల్ అంటూ గవాస్కర్ ప్రస్తావన తీసుకొచ్చి కవ్వించాడు మిస్టర్ నాగ్స్.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş