SNP
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు సెంచరీలు కూడా చేశాడు. అయినా కానీ కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. మరి వాటికి సమాధానంగా చెప్పాడో ఏమో కానీ, కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు సెంచరీలు కూడా చేశాడు. అయినా కానీ కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. మరి వాటికి సమాధానంగా చెప్పాడో ఏమో కానీ, కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
SNP
టీమిండియాకు విరాట్ కోహ్లీ ఒక వజ్రాయుధం. ఒక స్టార్ బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గా కూడా జట్టును నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లిన వ్యక్తి. ధోని వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. చాలా ఏళ్ల పాటు టీమిండియాను తిరుగులేని శక్తిగా నడిపించాడు. కప్పులు గెలవలేదనే కానీ, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టాప్ క్లాస్ టీమ్‌గా కొనసాగింది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అయితే అరివీర భయంకరమైన జట్టుగా రూపొందింది. కెప్టెన్సీ వదిలేసి.. ప్రస్తుతం టీమ్‌లో ఓ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నా.. కోహ్లీ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు. పైగా వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు కూడా బాదేశాడు.
అయితే.. కోహ్లీపై గతకొన్ని రోజులుగా చాలా విమర్శలు వస్తున్నాయి. స్లోగా ఆడుతున్నాడని, సెంచరీలు, రికార్డుల కోసం చూసుకుంటున్నాడంటూ కొంతమంది నెటిజన్లు మండిపడ్డారు. కానీ, కోహ్లీ టీమిండియాకు ఎంతో చేశాడు. అయినా కూడా కోహ్లీపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వీటికి సమాధానంగా కాదు కానీ, కోహ్లీ తన బ్యాటింగ్ స్టైల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బ్యాటింగ్‌లో ఇంప్రూమెంట్, అలాగే ఆడే షాట్స్‌లో ఇంప్రూమెంట్ ఏమైనా సరే చాలా మంది తెలియదని, ఏది చేసినా జట్టుకు ఉపయోగపడేందుకే చేస్తానని, ఒక ఒక బ్యాట్స్‌మెన్ అయ్యేదు కాదని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తాను ఏం చేసినా అది టీమ్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందా అని ఆలోచించి చేస్తానని కోహ్లీ పేర్కొన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు వేసే ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ బంతులకే కోహ్లీ ఇబ్బంది పడుతుంటాడనే వాదన ఉంది. కానీ, ఇప్పుడు కోహ్లీ ఆ వీక్‌నెస్‌ను కూడా ఓవర్ కమ్ చేసినట్లు కనిపిస్తున్నాడు. కానీ, ఈ మార్పును ఎవరూ గుర్తించరు. అలాగే క్రికెట్ చరిత్రలోనే కొన్ని అసాధారణమైన షాట్లు కూడా కోహ్లీ ఆడగలడు, ఆడాడు కూడా. టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన సమయంలో హరీస్ రౌఫ్ అందుకు చక్కటి ఉదాహరణ. ఇలా బ్యాటింగ్‌లో, షాట్స్‌లో కోహ్లీ ఇంప్రూమెంట్స్ చూపిస్తుంటాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌లో కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తున్నాడు. అందుకే కాస్త స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉన్నా.. టీమ్ కోసమే ఆడుతున్నాడు. పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పడం, మిడిల్ ఓవర్స్‌లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. రన్‌రేట్ పడిపోకుండా చూడటం, కష్టమైన పిచ్‌లపై చివరి వరకు బ్యాటింగ్ చేయడం ప్రస్తుతం టీమిండియా కోహ్లీ బాధ్యత. దాన్ని అతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. అందుకే భారత జట్టు ఇంత స్ట్రాంగ్‌గా ఉంది. మరి కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మీ అభ్రియాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kohli said “Lot of people don’t know this about the improvement of batting – Improvement happens when you think what can I add to my game & any shot to win the matches for my team. You don’t do it to become a complete batsman”. [Star Sports] pic.twitter.com/kGs6ztWdQo
— Johns. (@CricCrazyJohns) November 11, 2023