SNP
Virat Kohli: భారత జట్టు సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగబోయే రెండో టీ20తో కింగ్ తన రీఎంట్రీని ఇస్తున్నాడు. దీని కోసం ఫ్యాన్స్ ఎందురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌తో కోహ్లీ ముందున్న సవాళ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Virat Kohli: భారత జట్టు సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగబోయే రెండో టీ20తో కింగ్ తన రీఎంట్రీని ఇస్తున్నాడు. దీని కోసం ఫ్యాన్స్ ఎందురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌తో కోహ్లీ ముందున్న సవాళ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఇండోర్ వేదికగా ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హైలెట్ ఏంటంటే.. టీమిండియా సూపర్ స్టార విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. దీంతో.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లీ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోహ్లీ వస్తాడు.. ఆఫ్ఘనిస్థాన్‌ను కుమ్మేస్తాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే.. కోహ్లీ ఆడుతున్న ఈ మ్యాచ్‌కు ఇంత హైప్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. కోహ్లీ దాదాపు 14 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతుండటం ఒకటైతే.. రెండోది టీ20 వరల్డ్ కప్ 2024 ప్రిపరేషన్స్‌లో భాగంగా ఈ మ్యాచ్ ఆడుతుండటం మ్యాచ్‌పై ఆసక్తిని రేకేతిస్తోంది. టీమిండియా ఊరిపి పీల్చుకో.. విరాట్ కోహ్లీ తిరిగొస్తున్నాడంటూ.. భారత క్రికెట్ అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.
2022 నవంబర్ 10న ఇంగ్లండ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్ ఆడిన విరాట్ కోహ్లీ మళ్లీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం పూర్తిగా వన్డేల ఫోకస్ పెట్టాడు. అందకే టీ20 క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉన్నాడు. అయితే.. చివరి సారిగా ఆడిన టీ20 మ్యాచ్‌లోనూ కోహ్లీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఎంతో కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, సూర్యుకుమార్ యాదవ్, రిషభ్ పంత్ లాంటి స్టార్లు విఫలమైనా కోహ్లీ హాఫ్ సెంచరీతో జట్టును నిలబెట్టాడు. అతనితో పాటు రోహిత్, పాండ్యా రాణించారు. అయినా కూడా భాతర బౌలర్లు దారుణంగా విఫలం అవ్వడంతో టీమిండియా ఘోరంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమి బాధను తట్టుకుని.. వన్డే వరల్డ్ కప్ గురి పెట్టిన టీమిండియా.. ఫైనల్లో ఓటమి పాలై.. కప్పును చేజార్చుకుంది. ఆ బాధ నుంచి కూడా కోలుకుని.. కోహ్లీ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో పర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఆఫ్ఘాన్‌తో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు.
కోహ్లీ ముందున్న సవాళ్లు ఇవే..
విరాట్ కోహ్లీ తిరిగి టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తుండటాన్ని క్రికెట్ అభిమానులు అంతా స్వాగతిస్తున్నా.. కోహ్లీ ముందుకు కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత.. కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్ ఆడతారా? రాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో వీరికి చోటు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీటన్నిటిని పచాపంచలు చేస్తూ.. బీసీసీఐ ఇద్దరిని ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే.. టీ20 వరల్డ్ కప్ ముందు ఇదే చివరి టీ20 సిరీస్, దీంతో కోహ్లీ ఎలాగైనా ఈ రెండు మ్యాచ్ల్‌లో సత్తా చాటాలి. కోహ్లీ సత్తా మీద ఎవరికి ఎలాంటి డౌట్ లేకపోయినా.. టీ20 వరల్డ్ కప్ ముందు ఆత్మవిశ్వాసం పొందేందుకైనా కోహ్లీ పరుగులు చేయాలి. దీని తర్వాత ఐపీఎల్ ఉన్నా.. ఒక అంతర్జాతీయ సిరీస్‌లో రాణిస్తే ఆ కిక్కే వేరు. పైగా ఆఫ్ఘాన్‌పై టీ20ల్లో కోహ్లీ మంచి రికార్డు ఉంది. ఆఫ్ఘాన్‌పైనే కోహ్లీకి టీ20 సెంచరీ ఉంది. మరి ఆదివారం మ్యాచ్‌లో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో వేచి చూడాలి. మరి దాదాపు 14 నెలల తర్వాత కోహ్లీ టీ20 క్రికెట్ ఆడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A fan bowing down to Virat Kohli in the practice session.pic.twitter.com/xUUdWT5mW8
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 13, 2024