iDreamPost
android-app
ios-app

VIDEO: లబుషేన్‌ ముందు కోహ్లీ డాన్స్‌! నెక్ట్స్‌ లెవెల్‌ టీజింగ్‌

  • Published Sep 27, 2023 | 5:01 PM Updated Updated Sep 27, 2023 | 5:01 PM
  • Published Sep 27, 2023 | 5:01 PMUpdated Sep 27, 2023 | 5:01 PM
VIDEO: లబుషేన్‌ ముందు కోహ్లీ డాన్స్‌! నెక్ట్స్‌ లెవెల్‌ టీజింగ్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో.. అదే రేంజ్‌లో చిల్‌ అవుతూ కనిపిస్తాడు. బౌలర్ల సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. తన డ్యాన్స్‌లతో క్రౌడ్‌ను ఎంటటైన్‌ చేస్తుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఆడుతున్న కోహ్లీ.. ఫన్నీ మూమెంట్స్‌తో అలరించాడు. ఈ సారి ఏకంగా ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ను సరదాగా టీజ్‌ చేశాడు కోహ్లీ. మిచెల్‌ మార్ష్‌ అవుట్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబుషేన్‌ ముందుకు వెళ్లి కోహ్లీ డాన్స్‌ చేస్తూ కనిపించాడు.

సాధారణంగా కోహ్లీ చాలా సరదాగా ఉంటాడు. అయితే.. రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టీవ్‌ స్మిత్‌ ఎండకు విలవిల్లాడిపోయాడు. మ్యాచ్‌ మధ్యలో ఆసీస్‌ ఆటగాళ్లు స్మీత్‌ కోసం కుర్చి తీసుకొచ్చి మరీ డ్రింక్స్‌ తాగించారు. ఎండ నుంచి రక్షణగా టవల్‌ అడ్డుపెట్టి కాస్త సేదతీర్చారు. ఈ సమయంలోనే కోహ్లీ-లబుషేన్‌ మధ్య సరదా సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభం నుంచి ఆసీస్‌ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అయితే.. టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం 96 పరుగులతో అదరగొట్టి.. కొద్దిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42.3 ఓవర్లలో 299 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. స్మిత్‌ 74, అలెక్స్‌ క్యారీ 11, మ్యాక్స్‌వెల్‌ 5, కామెరున్‌ గ్రీన్‌ 9 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. లబుషేన్‌ 42, ప్యాక్‌ కమిన్స్‌ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అలాగే సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ చెరో వికెట్‌ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ డ్యాన్స్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: రన్నప్‌లో కిందపడిన బౌలర్‌ టవల్‌! బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్‌